
ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో ఒక నూతన అధ్యాయం ప్రారంభమైంది. విద్యార్థుల ఆరోగ్యం, వ్యక్తిగత పరిశుభ్రత మరియు క్రమశిక్షణను ఒక జీవనశైలిగా మార్చే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం “ముస్తాబు (MUSTABU)” అనే వినూత్న డైలీ హైజీన్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. దీనికి సంబంధించి G.O.Ms.No.43 (తేదీ: 19-12-2025) విడుదల చేస్తూ, రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ మరియు రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో తక్షణమే అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
What is MUSTABU Program AP
MUSTABU అనే పదానికి తెలుగులో “అందంగా సిద్ధమవ్వడం” అనే అర్థం ఉంది. ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం విద్యార్థుల్లో చిన్నతనం నుంచే పరిశుభ్రతపై అవగాహన కల్పించడం. నీటి ద్వారా వచ్చే వ్యాధులు, చర్మ వ్యాధులు, వైరల్ జ్వరాలను నివారించడం ద్వారా విద్యార్థుల హాజరు శాతం పెంచడం ఈ కార్యక్రమం ముఖ్య లక్ష్యం. ఇది Swachh Bharat Mission మరియు WASH (Water, Sanitation and Hygiene) మార్గదర్శకాలకు అనుగుణంగా రూపొందించబడింది.
MUSTABU G.O. Ms No.43 – Key Highlights
| అంశం | వివరణ |
|---|---|
| ప్రకటన చేసిన అధికారి | కోన శశిధర్, సెక్రటరీ (School Education) |
| ప్రధాన నినాదం | Personnel & Community Hygiene |
| లక్షిత విద్యార్థులు | 1వ తరగతి నుండి 12వ తరగతి వరకు |
| అమలు పరిధి | ప్రభుత్వ, ప్రైవేట్, రెసిడెన్షియల్ విద్యాసంస్థలు |
Why MUSTABU Program is Mandatory
చాలా మంది విద్యార్థులు సరైన పరిశుభ్రత లేకపోవడం వల్ల తరచూ అనారోగ్యానికి గురవుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. దీని కారణంగా విద్యలో అంతరాయం ఏర్పడుతోంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు SASA (Swarna Andhra – Swachha Andhra) ప్రచారంలో భాగంగా ముస్తాబు కార్యక్రమాన్ని రూపొందించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్‌గా అమలు చేసిన ఈ కార్యక్రమం మంచి ఫలితాలు ఇవ్వడంతో, ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అన్ని విద్యాసంస్థల్లో దీనిని Mandatory Routineగా అమలు చేస్తున్నారు.
Daily Implementation Steps (Standard Operating Procedure – SOP)
ప్రతి పాఠశాల మరియు కళాశాల క్రింది విధానాలను తప్పనిసరిగా పాటించాలి.
- డైలీ హైజీన్ అబ్జర్వేషన్
ప్రతిరోజూ ఉదయం అసెంబ్లీ అనంతరం 5 నిమిషాల పాటు ఉపాధ్యాయులు విద్యార్థుల గోర్లు, జుట్టు, దుస్తులను పరిశీలించాలి. - Handwashing Practice
మధ్యాహ్న భోజనానికి ముందు, టాయిలెట్ ఉపయోగించిన తర్వాత సబ్బుతో చేతులు కడగడం తప్పనిసరి. - MUSTABU Corner
ప్రతి తరగతిలో అద్దం, సబ్బు, నెయిల్ కట్టర్ మరియు హైజీన్ అవగాహన చార్టులతో ప్రత్యేక స్థలం ఏర్పాటు చేయాలి. - Menstrual Hygiene Awareness
కౌమార దశలోని బాలికలకు ఋతుక్రమ పరిశుభ్రతపై ప్రత్యేక అవగాహనతో పాటు అవసరమైన సౌకర్యాలు కల్పించాలి.
Monitoring Authorities and Responsibilities
| అధికారి | ప్రధాన బాధ్యతలు |
|---|---|
| School Management | తాగునీరు, సబ్బు, టాయిలెట్ సౌకర్యాలు నిరంతరం అందుబాటులో ఉంచడం |
| Hygiene Leaders | విద్యార్థుల్లో ఇద్దరిని రొటేషన్ పద్ధతిలో నియమించి పర్యవేక్షణ |
| DEO / APC | నెలవారీ నివేదికల పరిశీలన, ఉత్తమ పాఠశాలలకు గ్రేడింగ్ |
Rewards and Recognition under MUSTABU
విద్యార్థుల్లో పరిశుభ్రతపై ఆసక్తి పెంచేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలను ప్రకటించింది.
- MUSTABU Star
ప్రతి వారం తరగతిలో అత్యంత పరిశుభ్రంగా ఉండే విద్యార్థికి ఈ గుర్తింపు. - Clean Classroom Award
నెలకు ఒకసారి అత్యంత శుభ్రంగా నిర్వహించబడిన తరగతి గదికి అవార్డు. - District Level Recognition
జిల్లా స్థాయిలో ముస్తాబు కార్యక్రమాన్ని ఉత్తమంగా అమలు చేసే విద్యాసంస్థలకు ప్రత్యేక పురస్కారాలు
FAQ’S
పాఠశాల విద్యార్థుల కోసం రూపొందించిన డైలీ హైజీన్ మరియు క్రమశిక్షణ కార్యక్రమం.
19-12-2025 నుంచి తక్షణమే అమల్లోకి వచ్చింది.
అవును. ప్రభుత్వ, ఎయిడెడ్ మరియు ప్రైవేట్ విద్యాసంస్థలన్నింటికీ వర్తిస్తుంది.