Table of Contents
Aadhaar Bank Link NPCI Status: ఫ్రీ గ్యాస్ సిలిండర్ పేమెంట్ స్టేటస్
Aadhaar Bank Link NPCI Status :: ప్రస్తుతం ఏపీలో ఎక్కడ చూసినా Free Gas Cylinder స్కీం హాట్ టాపిక్ గా ఉంది.. మరి అందరికీ ఇక్కడే ఒక సందేహం ఉంది ఫ్రీ గ్యాస్ కి సంబంధించి సబ్సిడీ అమౌంట్ అనేది ఏ బ్యాంకు లో క్రెడిట్ అవుతుంది. పూర్తి వివరాలు ఈ పేజీలో తెలుసుకుందాం…
Free Gas Cylinder Scheme
ఓటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సూపర్ సిక్స్ లో భాగంగా ఒక్కొక్క పథకం ప్రారంభించడం జరుగుతుంది.. అందులో భాగంగానే ఫ్రీ గ్యాస్ సిలిండర్ స్కీమ్ అనేది ప్రతి ఇంటికి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు అందించడానికి ఇప్పుడు కూటమి ప్రభుత్వం విధి విధానాలు వివరించడం జరిగింది.
ఏపీలో వీరికే ఉచిత సిలిండర్
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచిత సిలిండర్ కు ప్రభుత్వం కొత్తగా విధివిధానాలు ఖరారు చేసింది..
- తెల్లరేషన్ కార్డు
- ఆధార్ కార్డు ఉన్నవారు
- ఈ పథకానికి అర్హులుగా ప్రకటించింది.
ఈ నెల 29 నుంచి గ్యాస్ బుకింగ్ ప్రారంభం కానుండగా దీపావళి సందర్భంగా 31న తొలి ఉచిత సిలిండర్ డెలివరీ చేస్తామని తెలిపింది. కాగా ఆర్థికసంవత్సరంలో 4 నెలలకు ఒకటి చొప్పున మొత్తం 3 సిలిండర్లను రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందించనుంది.
సిలిండర్ బుక్ చేసుకోగానే రాష్ట్ర ప్రభుత్వం నుంచి SMS వెళుతుందని ఆయన వెల్లడించారు. బుకింగ్ కన్ఫర్మ్ అయ్యాక పట్టణాల్లో 24గంటలు, గ్రామాల్లో 48గంటల్లో సిలిండర్ సరఫరా అవుతుందన్నారు. డెలివరీ అయ్యాక 48 గంటల్లోపు డబ్బు ఖాతాదారుల అకౌంట్లలోకి జమవుతుందని తెలిపారు.
- దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించనుంది.
- ప్రతి 4 నెలల్లో లబ్ధిదారులు ఒక సిలిండర్ (ఏడాదికి 3) ఉచితంగా పొందవచ్చు.
- ప్రస్తుతం సిలిండర్ ధర ₹876గా ఉండగా, ఇందులో రాయితీ ₹25 జమ అవుతోంది.
- మిగతా ₹851ను సిలిండర్ బుక్ చేసుకున్న లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయనుంది.
- ఈ నెల 29 నుంచే ఉచిత గ్యాస్ బుకింగ్ కు శ్రీకారం చుట్టేలా, దీపావళి నుంచి సరఫరాచేసేలా సమాలోచనలు చేస్తోంది. #FreeGasCylinders
What is NPCI Aadhar Link to Bank Account?
ప్రస్తుతం సమాజంలో ప్రభుత్వ పథకాల పేరుతో ప్రభుత్వాలు లబ్ధిదారులు ఖాతాలో నేరుగా DBT ( డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ) అనే పద్ధతితో ప్రభుత్వానికి సంబంధించి ఆ పథకం డబ్బులు నేరుగా లబ్ధిదారులు ఖాతాలో జమ చేస్తుంది. అయితే ఈ డబ్బులు మీ అకౌంట్లో క్రెడిట్ అవ్వాలంటే తప్పకుండా మీకు NPCI లింక్ అనేది కలిగి ఉండాలి. సో ఈ లింక్ అనేది మీకు లేకపోతే ప్రభుత్వం నుండి వచ్చే ఏ ఒక్క రూపాయి అనేది మీ అకౌంట్లో క్రెడిట్ అవ్వదు. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ మీ ఆధార్ కార్డు కి బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ ఉందో లేదో చెక్ చేసుకోండి.
Aadhaar Bank Link NPCI Status
ఏదైతే ఈ ఫ్రీ గ్యాస్ కి సంబంధించి సబ్సిడీ అమౌంట్ అనేది ఉందో మన ఆధార్ కార్డుకి ఏ బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ అయితే ఆ బ్యాంకులో మాత్రమే క్రెడిట్ అవుతుంది.. అయితే ఇప్పుడు ఫ్రీ గాస్ పేమెంట్ స్టేటస్ ఎలా చెక్ చేయాలో పూర్తి వివరాలు తెలుసుకోండి.
Step 1 :: ఫస్ట్ అఫ్ ఆల్ మీరు UIDAI Official Website క్లిక్ చెయ్యాలి. ఈ క్రింది విధంగా మీకు డిస్ప్లే ఓపెన్ అవుతుంది.
Step 2 :: పైన కనబడిన విధంగా మీకు డిస్ప్లే ఓపెన్ అవ్వగానే కిందికి మీరు పేజిని స్క్రోల్ చేస్తే Bank Seeding Status అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్ పై క్లిక్ చేయండి.
Step 3 :: ఆ ఆప్షన్ పై క్లిక్ చేయగానే మీకు లాగిన్ పేజీ ఓపెన్ అవుతుంది.. అక్కడ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చర్ ఎంటర్ చేయండి.. ఎంటర్ చేయగానే సబ్మిట్ బటన్ పై క్లిక్ చేస్తే ఓటిపి వస్తుంది.. ఓటిపి ఎంటర్ చేసి లాగిన్ బటన్ పై క్లిక్ చేయండి.
ఇవి కూడా చదవండి
ఆంధ్ర బ్యాంకు లో 1500 జాబ్స్ రిలీజ్
ఫ్రీ గ్యాస్ సిలిండర్ పథకం ఫుల్ డీటెయిల్స్
ఫ్రీగా సర్టిఫికెట్స్ డౌన్లోడ్ చేసుకోండి
Step 4 :: మళ్లీ మీకు కొత్తగా ఇంకో పేజీ ఓపెన్ అయి Bank Seeding Status ఆప్షన్ మళ్ళీ ఓపెన్ అవుతుంది.. నెక్స్ట్ ఆ ఆప్షన్ పై క్లిక్ చేయండి.
Step 5 :: ఫైనల్ గా మీరు పైన ఇమేజ్ లో చూపించిన విధంగా బ్యాంకు సీడింగ్ స్టేటస్ ఆప్షన్ పై క్లిక్ చేయగానే మీ ఆధార్ కార్డు ఏ బ్యాంక్ అకౌంట్ కి లింక్ అయిందో త్రీ గ్యాస్ స్కీమ్ సంబంధించి అక్కడ ఏ బ్యాంకు అయితే యాక్టివ్ లో ఉంటే ఆ బ్యాంక్ అకౌంట్లో DBT పేమెంట్ ద్వారా మీ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది.
Step 6 :: పైన ఇమేజ్ లో చూపించిన విధంగా మీ ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్ లింక్ అయిందో. ఆ బ్యాంకు పేరు , అండ్ అక్కడ స్టేటస్ వచ్చేసి ఆక్టివ్ గా ఉంటే మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు.. అక్కడ చూపించిన బ్యాంకులో మీ ఫ్రీ గ్యాస్ పేమెంట్ అనేది క్రెడిట్ అవుతుంది. 👇
Aadhaar Bank Link NPCI Status Link
గమనిక :: పైనున్న లింకును క్లిక్ చేసుకుని మీ స్టేటస్ తెలుసుకోండి.
Through Phone Call
మీరు ఫోన్ కాల్ ద్వారా కూడా మీ బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డుతో లింక్ అయిందా లేదా npci స్టేటస్ ని తెలుసుకోవచ్చును..
- ఫస్ట్ అఫ్ ఆల్ మీ మొబైల్ లో Dail *99*99*1# మీ బ్యాంకు అకౌంట్ కి రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ తో డల్ చేయండి.
- తర్వాత మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి.
- మళ్లీ రెండోసారి మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి.
- కొద్దిసేపటికి మీ ఆధార్ కార్డు ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అయింది. అనేది స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది.
Through mAadhaar app
ఇంకా సులభంగా మీ ఆధార్ కార్డు ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అయిందో తెలుసుకోవాలనుకుంటే ఎం ఆధార్ యాప్ ని ( mAadhaar App ) డౌన్లోడ్ చేసుకొని ఇంకా సులభంగా తెలుసుకోవచ్చు ను.
- ఫస్ట్ అఫ్ ఆల్ mAadhaar యాప్ ఓపెన్ చేసి లాగిన్ అవ్వండి.
- తర్వాత క్లిక్ మై ఆధార్ సెక్షన్ పై క్లిక్ చేయండి.
- నెక్స్ట్ సెలెక్ట్ Aadhaar – Bank Account Link Status పై క్లిక్ చేయండి.
- తర్వాత మీ యొక్క ఆధార్ నెంబర్, సెక్యూరిటీ పిన్, ఆఫ్టర్ క్లిక్ రిక్వెస్ట్ ఓటిపి పై క్లిక్ చేసిన వెంటనే రిజిస్టర్ మొబైల్ కి ఓటిపి వస్తుంది.
- ఓటిపి ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై టు చెక్ స్టేటస్ అండ్ ఆప్షన్ పై క్లిక్ చేయండి.
- ఫైనల్ గా ఇప్పుడు మీకు మీ ఆధార్ కార్డు ఏ బ్యాంక్ అకౌంట్ కి లింక్ అయిందని డిస్ప్లే అవుతుంది.
రైతులకు 20 వేలు అన్నదాత సుఖీభవ పథకం రిలీజ్ డేట్
Through SMS
మీ మొబైల్ నుంచి ఎస్ఎంఎస్ పంపించి కూడా మీ ఆధార్ కార్డు ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అయిందో తెలుసుకోవచ్చును.
- ఫస్ట్ అఫ్ ఆల్ మీ రిజిస్టర్ అయిన మొబైల్ నుంచి 567676 అనే నెంబర్ కి < మీ ఆధార్ నెంబర్ >< అకౌంట్ నెంబర్> పైన చెప్పిన ఫార్మాట్ లో మెసేజ్ టైప్ చేసి పంపించండి.
- మీకు తిరిగి కన్ఫర్మేషన్ కోసం ఒక మెసేజ్ అనేది రిసీవ్ అవుతుంది. ఈ మెసేజ్ లో మీ ఆధార్ కార్డు కి ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అయింది అనేది క్లియర్ గా తెలుస్తుంది.
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇