జులై 3వ వారంలో తల్లికి వందనం నిధుల విడుదల…

Join Telegram
Join Now

Thalliki Vandanam Latest News: ఆంధ్రప్రదేశ్‌లో ‘తల్లికి వందనం’ పథకం అమలుపై తాజా అప్‌డేట్ వెలువడింది. ఈ పథకానికి సంబంధించి మంత్రి లోకేశ్ ఈరోజు విద్యాశాఖ అధికారులతో ప్రత్యేకంగా సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలతో పాటుగా ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థికీ ఈ స్కీం కింద ఆర్థిక సాయం అందించేలా చూడాలని ఆయన అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీనికోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆయన ఈ సందర్భంగా అధికారులకు సూచించారు.

మరోవైపు, లబ్ధిదారులకు సంబంధించిన తల్లుల ఆధార్ వెరిఫికేషన్ ప్రక్రియ త్వరలోనే ముగుస్తుందని సమీక్షలో పాల్గొన్న విద్యాశాఖ అధికారులు మంత్రికి వివరించారు. ఆధార్ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయిన వెంటనే, జులై మూడో వారంలో ‘తల్లికి వందనం’ పథకాన్ని అమలు చేసేందుకు తాము అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు మంత్రికి స్పష్టం చేశారు.

Ad
CHECK STATUS