AP తల్లికి వందనం ఈ పనులు చేయకపోతే డబ్బులు రావు! | AP Thalliki Vandanam Status

Join Telegram
Join Now

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న తల్లికి వందనం (Thalliki Vandanam Scheme) నిధులు జూలై 16, 17, 18 తేదీలలో విడుదల కానున్నాయి. ఒకటో తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న ప్రభుత్వ మరియు ప్రైవేట్ విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ. 15,000 (రూ. 13,000 నేరుగా అకౌంట్‌కు, రూ. 2,000 పాఠశాల నిధికి) డీబీటీ ద్వారా జమ చేయనున్నారు.

డబ్బులు రావాలంటే ఈ అర్హతలు తప్పనిసరి:

  • 75% హాజరు: ప్రస్తుత విద్యా సంవత్సరంలో విద్యార్థికి ఖచ్చితంగా 75% హాజరు ఉండాలి. ఒక్క శాతం తక్కువైనా డబ్బులు రావు.
  • ఆధార్ & NPCI లింకింగ్: తల్లి బ్యాంక్ ఖాతా యాక్టివ్‌గా ఉండాలి. దానికి ఆధార్ నంబర్ మరియు NPCI మ్యాపింగ్ తప్పనిసరిగా అనుసంధానం అయి ఉండాలి.
  • సిక్స్ స్టెప్ వాలిడేషన్: కరెంట్ బిల్లు నెలకు 300 యూనిట్ల లోపు ఉండాలి. ఇంట్లో కారు ఉండకూడదు, కుటుంబ సభ్యులు ఎవరూ ఇన్‌కమ్ టాక్స్ లేదా ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండకూడదు.

ఆన్‌లైన్‌లో మీ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి?

లబ్ధిదారుల లిస్ట్‌లో మీ పేరు ఉందో లేదో, మీ అప్లికేషన్ ‘Eligible’ లో ఉందో లేదో మొబైల్‌లోనే చాలా సులభంగా చెక్ చేసుకోవచ్చు. మీ స్టేటస్ తెలుసుకోవడానికి కింద ఉన్న లింక్‌పై క్లిక్ చేయండి.

👉 ఇక్కడ క్లిక్ చేసి మీ తల్లికి వందనం స్టేటస్ చెక్ చేసుకోండి (AP Thalliki Vandanam Status Link)

స్టేటస్ ‘Unsatisfied’ లేదా ‘Ineligible’ వస్తే ఏం చేయాలి?

మీ స్టేటస్ చెక్ చేసినప్పుడు ఒకవేళ ‘Unsatisfied’ అని వస్తే కంగారు పడకండి. దానికి కారణం (NPCI Pending, Attendance Shortage, కరెంట్ బిల్లు ఎక్కువుండటం) పక్కనే ఉంటుంది. సరైన ఆధారాలతో వెంటనే మీ గ్రామ/వార్డు సచివాలయానికి వెళ్లి వెల్ఫేర్ అసిస్టెంట్ ద్వారా గ్రీవెన్స్ (Grievance) నమోదు చేసుకుంటే సమస్య పరిష్కారం అవుతుంది.

స్టేటస్ లో ‘Unsatisfied’ అని వస్తే ఏ కారణానికి ఏ డాక్యుమెంట్స్ ఇవ్వాలో, దాన్ని ఎలా పరిష్కరించుకోవాలో పూర్తి వివరాల కోసం కింది లింక్ చూడండి:

👉 Thalliki Vandanam ‘Unsatisfied’ స్టేటస్ అంటే ఏమిటి? ఎలా పరిష్కరించుకోవాలి? (పూర్తి వివరాలు)

Ad
CHECK STATUS