Chandranna Bheema Scheme : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే YSR భీమాని, చంద్రన్న బీమా ( Chandranna Bheema Scheme in Telugu ) గా పేరు మార్చడం జరిగింది. ఫ్రెండ్స్ నేను మీ అందరికీ ఈ పేజీలో వచ్చేసి చంద్రన్న బీమా స్కీం అర్హతలు, కావలసిన డాక్యుమెంట్స్, ఎలా అప్లై చేయాలి, చంద్రన్న బీమా గురించి సమగ్ర సమాచారం అందిస్తాను.
Table of Contents
Chandranna Bheema Scheme in Telugu
చంద్రన్న బీమా వెబ్‌సైట్ ప్రారంభించబడింది. దయచేసి 16.3.2024 నుండి 30.6.2024 మధ్య జరిగే క్లయిమ్‌లను వెంటనే అప్‌లోడ్ చేయడానికి అన్ని WEAలు/ WWDSకి తెలియజేయండి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దారిద్ర రేఖకు దిగువున ఉన్న ప్రతి కుటుంబం ఈ చంద్రన్న బీమా స్కీమ్ కి అర్హులు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రన్న బీమా ని ప్రజలకు అందే విధంగా ప్రభుత్వ అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం గత ప్రభుత్వం కన్నా చంద్రన్న బీమా ఇన్సూరెన్స్ కవరేజ్ నీ ఈ కింది విధంగా ప్రజలకు అందించడం జరుగుతుంది.
చంద్రన్న బీమా 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపు సహజ మరణం ఎవరైనా పొందితే ఆ కుటుంబం యొక్క నామినీకి 1 లక్ష రూపాయలు బీమా రూపంలో పొందడం జరుగుతుంది.
చంద్రన్న బీమా 18 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల లోపు యాక్సిడెంట్ గా ఎవరైనా మరణం పొందినట్లయితే ఆ కుటుంబం యొక్క నామినీకి 5 లక్షలు చంద్రన్న బీమా తరపున ఆ కుటుంబం ప్రయోజనం పొందుతారు.
చంద్రన్న బీమా నగదు 10 లక్షలకు పెంపు : ✓ చంద్రన్న బీమా సొమ్మును 3 లక్షల నుంచి పది10 లక్షల రూపాయలకు పెంచుతున్నట్లు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు.
✓ రాష్ట్రంలో కార్మిక సంక్షేమానికి ప్రభుత్వం పటిష్టమైన ప్రణాళికలను రచిస్తోందని కార్మికులతోపాటు పాత్రికేయులు, న్యాయవాదులను కూడా ఈ బీమాలోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు.
🔥 Hot Topics
- Top GK questions in Telugu with answers for competitive exams || General Knowledge Bits in Telugu
- Aadhar Bank Link Status : ఇక్కడ DBT ఉంటేనే డబ్బులు వస్తాయి!
- General Knowledge Questions – Simple Quiz Questions
- Free Gas Subsidy Status మీకు ఇంకా ఉచిత గ్యాస్ డబ్బులు రాలేదా! ఇలా మీ స్టేటస్ చెక్ చేసుకోండి
- NPCI Link Bank Account Online 2024: ఇంట్లో నుండి మీ ఆధార్ కార్డు కి బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకోండి!
Chandranna Bheema Scheme Eligibility
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజలు చంద్రన్న బీమా స్కీమ్ ని పొందాలంటే ఈ క్రింద చెప్పిన అర్హతలన్నీ కచ్చితంగా కలిగి ఉండాలి.
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం నివసిస్తూ ఉండాలి. 18 సంవత్సరాల వయసు నుంచి 60 సంవత్సరాల లోపు ఉండాలి.
- ముఖ్యంగా రేషన్ కార్డు కలిగి ఉండాలి.
- అలాగే ఆధార్ కార్డు కూడా కలిగి ఉండాలి.
- బ్యాంక్ అకౌంట్ తప్పనిసరి.
- ఎలక్ట్రిసిటీ బిల్ అనేది 300 యూనిట్స్ కన్నా తక్కువగా కలిగి ఉండాలి.
- మున్సిపాలిటీ పరిధిలో 1000 చదరపు అడుగుల కన్నా విస్తీర్ణం తక్కువ కలిగి ఉండాలి.
- మీ కుటుంబంలో ఎవరు గవర్నమెంట్ ఉద్యోగి ఉండకూడదు.
- అలాగే మీకు గాని మీ కుటుంబంలో ఎవరికైనా నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు.
- మరి ముఖ్యంగా మీ కుటుంబంలో మాగానికి సంబంధించి మూడు ఎకరాల లోపు, మెట్ట భూమి వచ్చి ఏడు ఎకరాల లోపు మొత్తం కలిపి 10 ఎకరాల లోపు భూమి కలిగి ఉండాలి.
- అలాగే ఎవరైనా సరే మీ కుటుంబంలో ఇన్కమ్ టాక్స్ పే చేస్తూ గా ఉండకూడదు.
గమనిక :: పైన ఉన్న ఏ ఒక్క అర్హతలో మీరు ఇన్ ఎలిజిబుల్ అయినా చంద్రన్న బీమా స్కీమ్ ( Chandranna Bheema Scheme ) అనేది మీకు వర్తించదు.
how to apply chandranna bheema
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఈ చంద్రన్న బీమా స్కీమ్ నీ అప్లై చేయాలంటే మీకు సంబంధించిన గ్రామ వార్డు సచివాలయం ఏదైతే ఉందో ఆ సచివాలయంలో వెల్ఫేర్ స్కీమ్స్ కు సంబంధించి ఒక అధికారి ఉంటాడు. అతని పేరు వెల్ఫేర్ అసిస్టెంట్. ఈ అధికారి దగ్గరికి మీరు వెళ్లి పలానా మనిషి పాలన కారణంతో చనిపోయాడు ఆ సమ్మతిత అధికారికి తెలియజేయగానే, ఆ అధికారి మీ ఇంటి దగ్గరికి వచ్చి ఈ చంద్రన్న బీమా స్కీమ్ కి సంబంధించి ఎలిజిబులిటీ చెక్ చేసుకుని అప్లై చేయడం జరుగుతుంది.
Chandranna Bheema Scheme Required Documents
చంద్రన్న బీమా అప్లై చేయాలంటే కచ్చితంగా ఈ క్రింద తెలిపిన డాక్యుమెంట్స్ అన్నీ ఉండాలి.
- కుటుంబంలో చనిపోయిన వ్యక్తికి సంబంధించిన నామిని కి ఆధార్ కార్డు అనేది ఉండాలి.
- అలాగే రేషన్ కార్డులో ఉండాలి, కొన్ని సమయాలలో గార్డెన్ గా కూడా పెట్టుకుంటారు. నామిని కి సంబంధించి బ్యాంక్ అకౌంట్ కచ్చితంగా ఉండాలి.
- చనిపోయిన వ్యక్తి యొక్క డెత్ సర్టిఫికేట్ ఉండాలి. అలాగే చనిపోయిన యొక్క వ్యక్తి ఆధార్ కార్డు మరియు తప్పనిసరిగా ఆ వ్యక్తి బీమా పాలసీలో నమోదయి ఉండాలి.
Chandranna Bheema Scheme Offical Website : Click Here
చంద్రన్న బీమా సహజ డెత్ క్లెయిమ్ ఫారం : Click Here
చంద్రన్న బీమా ప్రమాద డెత్ క్లెయిమ్ ఫారం : Click Here
చంద్రన్న బీమా క్లారిఫికేషన్
- ✓ 2023-24 సంవత్సరానికి గాను బీమా నమోదు జూన్ 2023లో నమోదు చేశారు.
- ✓ సం. 2023-24 బీమా 01-07-2024 నుండి అమల్లోకి వచ్చింది. ఈ బీమా గడువు 30.06.2024తో ముగుస్తుంది.
- ✓ చంద్రన్న బీమా లో క్లెయిమ్స్ రిజిస్ట్రేషన్ కొరకు 30.06.2024 వరకు అవకాశం ఇచ్చారు.
- ✓ 01.07.2024 నుండి 2024-25 పాలసీ సంవత్సరం ప్రారంభం అవుతుంది. దీనికి సంబంధించిన బీమా నమోదు(Beema Enrollment) కొత్తగా చేయాల్సి ఉంది.
- ✓ 01.07.2024 నుండి మరణించిన వారి విషయంలో క్లెయిమ్స్ ఎలా చేయాలేనిది ప్రభుత్వం నుండి క్లారిటీ రావాల్సి ఉంది. అప్పటి వరకు అందరూ తదుపరి ఆదేశాల కొరకు వైట్ చేయవలెను.
గమనిక :: చంద్రన్న బీమాకు సంబంధించి ఏ ఒక్క చిన్న అప్డేట్ వచ్చినా ఈ పేజీలో అప్డేట్ చేయడం జరుగుతుంది. మీకు ఇంకా మరింత ఇన్ఫర్మేషన్ కావాలంటే పైనున్న వాట్స్అప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.
- Top GK questions in Telugu with answers for competitive exams || General Knowledge Bits in Telugu
- Aadhar Bank Link Status : ఇక్కడ DBT ఉంటేనే డబ్బులు వస్తాయి!
- General Knowledge Questions – Simple Quiz Questions
- Free Gas Subsidy Status మీకు ఇంకా ఉచిత గ్యాస్ డబ్బులు రాలేదా! ఇలా మీ స్టేటస్ చెక్ చేసుకోండి
- NPCI Link Bank Account Online 2024: ఇంట్లో నుండి మీ ఆధార్ కార్డు కి బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకోండి!
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇