తల్లికి వందనం అనర్హుల జాబితాలో పేరు ఉందా? ఇలా దరఖాస్తు చేసుకోండి..

Join Telegram
Join Now

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యార్థుల తల్లులకు ఏటా ఆర్థిక సహాయం అందించే లక్ష్యంతో ‘తల్లికి వందనం’ (Thalliki Vandanam Scheme) పథకాన్ని అమలు చేస్తోంది. సాంకేతిక కారణాలు, ఆధార్ అనుసంధానం లోపాలు లేదా ఇతర నిబంధనల వల్ల అర్హులైనప్పటికీ మీ పేరు అనర్హుల జాబితాలో ఉంటే నిరాశ చెందాల్సిన అవసరం లేదు. పౌరుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం కొత్తగా పేరు మార్చిన స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డుల (Swarna Gramam Swarna Wardu) ద్వారా గ్రీవెన్స్ మోడ్యూల్ (Grievance Module) సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది.

తల్లికి వందనం 2026-27: ముఖ్యమైన అర్హతలు

స్వర్ణ గ్రామం లేదా స్వర్ణ వార్డు కేంద్రం ద్వారా దరఖాస్తు లేదా ఫిర్యాదు చేసుకునే ముందు కింది అర్హత ప్రమాణాలను సరిచూసుకోవాలి:

  • ఆదాయ పరిమితి: గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ నెలవారీ ఆదాయం రూ. 10,000, పట్టణ ప్రాంతాల్లో రూ. 12,000 మించకూడదు.
  • రేషన్ కార్డ్: కుటుంబంలో చెల్లుబాటు అయ్యే రైస్ కార్డ్ తప్పనిసరిగా ఉండాలి.
  • భూమి వివరాలు: కుటుంబానికి 3 ఎకరాల కంటే తక్కువ మాగాణి (తడి భూమి) లేదా 10 ఎకరాల లోపు మెట్ట (పొడి భూమి), లేదా రెండూ కలిపి 10 ఎకరాల లోపు మాత్రమే ఉండాలి.
  • వాహనాలు: నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు (ట్యాక్సీలు, ఆటోలు, ట్రాక్టర్లకు మినహాయింపు).
  • విద్యుత్: నెలవారీ విద్యుత్ వినియోగం 300 యూనిట్ల కన్నా తక్కువ ఉండాలి (గత 12 నెలల సగటు).
  • ఆస్తులు & ఉద్యోగాలు: పట్టణ ప్రాంతాల్లో 1000 చదరపు అడుగులకు మించిన ఆస్తి ఉండకూడదు. కుటుంబంలో ఆదాయపు పన్ను చెల్లించేవారు, ప్రభుత్వ ఉద్యోగులు లేదా పెన్షనర్లు ఉండకూడదు (శానిటేషన్, అంగన్‌వాడీ వర్కర్లకు మినహాయింపు).
  • చదువు & బ్యాంక్ లింక్: పిల్లలు 1 నుండి 12 వ తరగతి వరకు చదువుతుండాలి. తల్లి బ్యాంక్ ఖాతాకు ఆధార్ మరియు NPCI అనుసంధానం తప్పనిసరి.

వివిధ సమస్యలకు సమర్పించాల్సిన పత్రాలు

మీ సమస్యను బట్టి సంబంధిత పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది:

  • డేటా తప్పుగా ఉంటే: విద్యార్థి మరియు తల్లి లేదా సంరక్షకుడి ఆధార్ ధృవీకరణ.
  • విద్యుత్ వినియోగ సమస్య: స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు కేంద్రం లేదా విద్యుత్ శాఖ ద్వారా మీటర్ డీ-సీడింగ్ (Deseeding) రసీదు.
  • నాలుగు చక్రాల వాహనం (మినహాయింపు ఉన్నవి): వాహనానికి సంబంధించిన ఆర్‌సి (RC) బుక్.
  • ఆదాయపు పన్ను: పొరపాటున ఐటీ అనర్హత పడితే చార్టర్డ్ అకౌంటెంట్ (CA) సర్టిఫికేట్.
  • భూమి/ఆస్తి సమస్యలు: ల్యాండ్ రికార్డులు (1B/అడంగల్) లేదా మున్సిపల్ అసెస్‌మెంట్ నంబర్.

గ్రీవెన్స్ నమోదు చేసుకునే విధానం

ఫిర్యాదు నమోదు ప్రక్రియను మీరు నేరుగా చేయలేరు. సంబంధిత పత్రాలతో సమీప స్వర్ణ గ్రామం లేదా స్వర్ణ వార్డు కేంద్రానికి వెళ్లాలి. అక్కడ డిజిటల్ అసిస్టెంట్ (DA) లేదా వార్డ్ ఎడ్యుకేషన్ & డేటా ప్రాసెసింగ్ కార్యదర్శి (WEDS) తమ లాగిన్ ద్వారా BM SGSW (స్వర్ణ గ్రామం స్వర్ణ వార్డు) పోర్టల్‌ను ఓపెన్ చేస్తారు. అందులో Grievance Module ద్వారా మీ చైల్డ్ ఇన్ఫో (Child Enrolment ID) వివరాలు నమోదు చేసి, మీరు అనర్హతకు గురైన కారణాన్ని ఎంచుకుంటారు. దానికి సంబంధించిన సరైన ఆధారాలను (సర్టిఫికెట్లను) ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసి, ఓటీపీ లేదా బయోమెట్రిక్ ధృవీకరణతో ఫిర్యాదును సమర్పిస్తారు.

Ad
CHECK STATUS