
Ap Ration Card Holders Benifits : రాష్ట్రంలో రేషన్ కార్డు దారులకు ప్రభుత్వం తీపికబురు అందించింది. రేషన్ వస్తువుల్లో లోటు పాట్లను సరిచేసి మళ్లీ వాటిని బియ్యంతో పాటుగా అందించబోతోంది. ఈ మేరకు సెప్టెంబర్ నెల నుంచి పంచదారను రేషన్ లో యథావిధిగా లబ్దిదారులకు పంపిణీ చేయనున్నారు.
Table of Contents
అలాగే కొన్ని జిల్లాల్లో గోధుమ పిండి, రాగులు కూడా పేదలకు దశలవారీగా రేషన్ లో అందించే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. అక్టోబర్ నుంచి మిగిలిన సరుకుల్ని కూడా పంపిణీ చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.. రేషన్ కార్డుదారులకు బియ్యంతోపాటు పంచదార సరఫరా చేసేందుకు పౌరసరఫరాల శాఖ చర్యలు తీసుకుంది. అధికారులు ప్రస్తుతం సరైన తూకంతో పంచదార ప్యాకెట్లను సిద్ధం చేశారు. అంతేకాదు చక్కెర ప్యాకెట్ రంగు మార్చి.. ఇప్పటికే పౌరసరఫరాల గోడౌన్ల నుంచి రేషన్ షాపులకు బియ్యం, పంచదార సరఫరా చేస్తున్నారు. సెప్టెంబరులో బియ్యంతో పాటుగా పంచదార ఇచ్చేందుకు సన్నాహాలు చేశారు. జిల్లాల్లో ఉన్న నిల్వల మేరకు మాత్రమే పంచదార, రాగులు, గోధుమపిండి పంపిణీ జరగనుంది..
- Ather Energy Shares Surge: ఏథర్ ఎనర్జీ స్టాక్ జంప్.. దూసుకుపోతున్న ఈవీ మేకర్.. అదరగొట్టిన ఫలితాలు
- LIC Share Price: ఇన్వెస్టర్లకు బంపరాఫర్.. రూ. 382 కే ఎల్ఐసీ షేర్, పూర్తి వివరాలివే
- ఏపీ ప్రజలకు శుభవార్త.. ఇక రూ.100కే వారసత్వ ఆస్తుల రిజిస్ట్రేషన్
- తల్లికి వందనం డబ్బులు పడలేదా? తలెత్తే 30 ప్రధాన సమస్యలు, వాటి పరిష్కారాలు ఇవే!
- తల్లికి వందనం స్టేటస్‌లో Unsatisfied అని వస్తే ఏం చేయాలి?
బియ్యంతో పాటు పంచదార,రాగులు, గోధుమ పిండి పంపిణీ
బియ్యం మినహా ఇతర అన్ని సరుకులనూ గత ప్రభుత్వం ఎంపిక చేసిన సంస్థలు, కంపెనీలే సరఫరా చేస్తున్నాయి. ప్రభుత్వం వాటి స్థానంలో కొత్తవాటిని ఎంపిక చేసి వాటి ద్వారా పంపిణీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. గోధుమపిండి, కందిపప్పు సరఫరా టెండర్ల దశలో ఉండటంతో.. ఆ ప్రక్రియ పూర్తైన తర్వాత అక్టోబరు నుంచి వాటిని పూర్తి స్థాయిలో పంపిణీ చేస్తామని పౌరసరఫరాలశాఖ అధికారులు చెబుతున్నారు.
ఒక్కొక్క రేషన్ కార్డుకు పంచదార ప్యాకెట్ (అరకేజీ) చొప్పున రూ.17కు ఇస్తారు. అదే ఏఏవై (అంత్యోదయ అన్న యోజ) కార్డుకు కేజీ రూ.13కు అందిస్తారు. మరోవైపు రాగుల్ని కొన్ని జిల్లాలకు మాత్రమే కేటాయించారు. వీటిని తీసుకునేందుకు లబ్దిదారుల నుంచి వచ్చే డిమాండ్‌కు అనుగుణంగా ఇండెంట్ పెంచుతామని అధికారులు పేర్కొంటున్నారు.
అక్టోబర్ నుంచి కందిపప్పు పంపిణీకి అవకాశం
కేజీ నుంచి మూడు కేజీల వరకు ఉచితంగా రేషన్‌లో రాగులు తీసుకోవచ్చని, రాగులు ఎన్ని కేజీలు తీసుకుంటే అన్ని కేజీలు బియ్యం తగ్గించి లబ్దిదారులకు అందిస్తామని చెబుతున్నారు. అయితే కందిపప్పు, గోధుమ పిండిని అక్టోబర్ నెల నుంచి పంపిణీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సెప్టెంబర్ నెలకు సంబంధించి 1,48,43,671 కార్డుదారులకు చెందిన 4,31,81,370 మందికి సరుకులను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇదిలా ఉండగా గత వారం జరిగిన కేబినెట్ సమావేశంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా అదనంగా రేషన్ షాపుల్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది.
- Ather Energy Shares Surge: ఏథర్ ఎనర్జీ స్టాక్ జంప్.. దూసుకుపోతున్న ఈవీ మేకర్.. అదరగొట్టిన ఫలితాలు
- LIC Share Price: ఇన్వెస్టర్లకు బంపరాఫర్.. రూ. 382 కే ఎల్ఐసీ షేర్, పూర్తి వివరాలివే
- ఏపీ ప్రజలకు శుభవార్త.. ఇక రూ.100కే వారసత్వ ఆస్తుల రిజిస్ట్రేషన్
- తల్లికి వందనం డబ్బులు పడలేదా? తలెత్తే 30 ప్రధాన సమస్యలు, వాటి పరిష్కారాలు ఇవే!
- తల్లికి వందనం స్టేటస్‌లో Unsatisfied అని వస్తే ఏం చేయాలి?