జూలై లో ‘తల్లికి వందనం’ నిధుల విడుదల

Thalliki Vandanam Latest Update: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘తల్లికి వందనం’ పథకం నిధులను జూలై మొదటి వారంలో తల్లుల ఖాతాల్లో నేరుగా జమ చేసేలా ఏర్పాట్లు చేస్తోంది. ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న సుమారు 68 లక్షల మంది విద్యార్థులకు ఈ ఏడాది లబ్ధి చేకూరనుందని అంచనా వేస్తున్నారు.

Join Telegram
Join Now

అర్హులైన ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ.15,000 చొప్పున ప్రభుత్వం అందిస్తుంది. ఇందులో రూ.13,000 తల్లి బ్యాంకు ఖాతాలో జమ చేసి, మిగిలిన రూ.2,000 సంబంధిత పాఠశాల నిర్వహణకు బదిలీ చేస్తారు. కుటుంబంలో ఎంతమంది పిల్లలు అర్హత సాధిస్తే అంతమందికీ విడివిడిగా ఈ ఆర్థిక సాయం అందుతుంది. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు ఇది వర్తిస్తుంది.

నిధుల విడుదలకు ముందే తల్లులు బ్యాంకు ఖాతాకు ఆధార్ అనుసంధానం తప్పనిసరిగా చేసుకోవాలి. లబ్ధిదారులు bm-sgsw.ap.gov.in పోర్టల్ ద్వారా లేదా గ్రామ, వార్డు సచివాలయాల్లో తమ అర్హత స్థితిని ముందుగానే నిర్ధారించుకోవాలని అధికారులు సూచించారు.

Ad
CHECK STATUS