ఏపీ ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ ఫలితాలు | AP Intermediate Advanced Supplementary Results 2026 

Join Telegram
Join Now

ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు ఈరోజు (జూన్ 18, 2026 గురువారం) మధ్యాహ్నం 12 గంటలకు విడుదల కానున్నాయి. ఈ ఫలితాలను ఇంటర్మీడియట్ బోర్డు విద్యా మండలి కార్యదర్శి రంజిత్ భాషా విడుదల చేయనున్నారు. ఈ ఏడాది మే 21 నుంచి జూన్ 4వ తేదీ వరకు ఈ పరీక్షలు జరిగాయి. మంగళవారంతో మూల్యాంకనం పూర్తికావడంతో ఈరోజే ఫలితాలను ప్రకటిస్తున్నారు.

విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ https://resultsbie.ap.gov.in/ ద్వారా లేదా ఏపీ మనమిత్ర వాట్సాప్ నెంబర్ 9552300009 ద్వారా తమ ఫలితాలను పొందవచ్చు. వెబ్‌సైట్ హోమ్‌పేజీలో IPASE 2026 ఫలితాల లింక్‌పై క్లిక్ చేసి, విద్యార్థులు తమ రోల్ నెంబర్, పుట్టిన తేదీ (డేట్ ఆఫ్ బర్త్) నమోదు చేసి మార్కులను తెలుసుకోవచ్చు. కాగా, ఈ సంవత్సరం ఇంటర్ రెండో సంవత్సరం విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం ఇంప్రూవ్మెంట్ రాసుకునే సదుపాయం కల్పించింది.

Ad
CHECK STATUS