నిరుద్యోగ యువతకు నైపుణ్యాభివృద్ధి కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఏపీ కౌశలం’ (AP Kaushalam) ప్రోగ్రామ్ 2వ రౌండ్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ పరీక్షలు April 13 2026 నుంచి 17వ తేదీ వరకు జరగనున్నాయి. అభ్యర్థులు ముందుగా తమ అర్హత (Eligibility), ప్రొఫైల్ వెరిఫికేషన్ స్టేటస్‌ను ఆన్లైన్లో తప్పనిసరిగా సరిచూసుకోవాలని అధికారులు సూచించారు.
Join Telegram
Join Now
అభ్యర్థులు తమకు కేటాయించిన పరీక్షా తేదీ, సమయం, మరియు సచివాలయం వివరాలను అధికారిక పోర్టల్‌లో సులభంగా తెలుసుకోవచ్చు. దీనికోసం ప్రత్యేకంగా సెర్చ్ టూల్ అందుబాటులోకి తెచ్చారు. అందులో మీ పేరు (Candidate Name), సచివాలయం పేరు లేదా సెక్రటేరియట్ కోడ్.. ఈ మూడింట్లో ఏదో ఒక వివరాలు నమోదు చేసి ఎగ్జామ్ డీటెయిల్స్ పొందవచ్చు.
OR
OR
ముఖ్యమైన నిబంధనలు ఇవే:
- అభ్యర్థులు తమకు కేటాయించిన గ్రామ లేదా వార్డు సచివాలయంలో (Assigned Sachivalayam) మాత్రమే ఈ పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఇతరుల కేంద్రాల్లో అనుమతించరు.
- పరీక్షకు అవసరమైన హెడ్సెట్, వెబ్‌క్యామ్ తదితర ఎలక్ట్రానిక్ సామగ్రిని ఆయా సెంటర్లలోనే నిర్వాహకులు అందిస్తారు.
- ఇది పూర్తిగా ఆన్లైన్ అసెస్మెంట్. పరీక్ష రాసే సమయంలో కంప్యూటర్లో ట్యాబ్స్ స్విచ్ (Tab Switching) చేస్తే ఎగ్జామ్ ఆటోమేటిక్‌గా రద్దవుతుంది.
ఏపీ కౌశలం ఎగ్జామ్ 2026 – ముఖ్యాంశాలు
| వివరాలు | సమాచారం |
| పరీక్షల తేదీలు | 2026 APRIL13 నుంచి APRIL17 వరకు |
| వివరాలు ఎలా చెక్ చేయాలి? | అభ్యర్థి పేరు, సచివాలయం పేరు లేదా కోడ్ ద్వారా |
| పరీక్షా కేంద్రం | కేటాయించిన సంబంధిత సచివాలయం మాత్రమే |
| పరీక్ష ఫీజు | పూర్తిగా ఉచితం (ప్రభుత్వ స్కిల్ అసెస్మెంట్) |
| కఠిన నిబంధన | ఎగ్జామ్ సమయంలో ట్యాబ్ స్విచ్ చేయకూడదు |
