
Join Telegram
Join Now
తల్లికి వందనం: రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 64.76 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూర్చే ‘తల్లికి వందనం (Thalliki Vandanam)’ తొలి విడత అర్హుల మరియు అనర్హుల జాబితాలను స్థానిక స్వర్ణ గ్రామం / స్వర్ణ వార్డు (SGSW – పాత సచివాలయాలు) కేంద్రాల్లో జులై 21న ప్రదర్శిస్తున్నారు.
ముఖ్యమైన తేదీలు గమనించండి:
- అకౌంట్లో డబ్బులు జమ: జులై 22
- ఫిర్యాదులకు (Grievance) అవకాశం: జులై 22 నుండి ఆగస్టు 3 వరకు
- కొత్త అడ్మిషన్లకు చివరి తేదీ: ఆగస్టు 25 (వీరికి ఆగస్టు 30న డబ్బులు పడతాయి)
తల్లిదండ్రులు ఏం చేయాలి?
- స్టేటస్ చెక్: వెంటనే మీ స్థానిక సచివాలయానికి (SGSW ఆఫీసుకి) వెళ్లి లిస్ట్‌లో మీ పిల్లల పేరు ఉందో లేదో సరిచూసుకోండి.
- పేరు లేకపోతే: ఒకవేళ అనర్హుల జాబితాలో ఉంటే.. మీ రేషన్ కార్డ్, ఆధార్, బ్యాంక్ పాస్‌బుక్, మరియు స్కూల్/కాలేజీ ఐడీ జిరాక్స్‌లతో ఆగస్టు 3 లోపు అక్కడే సిబ్బందికి (WEA/WWES) ఫిర్యాదు ఇవ్వండి.
- NPCI లింక్: లిస్ట్‌లో పేరున్నా.. తల్లి బ్యాంక్ ఖాతాకు ఆధార్ (NPCI / DBT) లింక్ లేకపోతే అకౌంట్లో డబ్బులు పడవు. కాబట్టి మీ ఖాతాకు ఆధార్ సీడింగ్ ఉందో లేదో ముందే చెక్ చేసుకోండి.