తల్లికి వందనం కు తాజా మార్గదర్శకాలు.. కిట్ల పంపిణీ ఆలస్యం

Thalliki Vandanam Scheme: యాభై రోజుల సుదీర్ఘ వేసవి సెలవుల విరామం తర్వాత రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు తిరిగి పునఃప్రారంభమయ్యాయి. అయితే ఈ విద్యా సంవత్సరం ‘తల్లికి వందనం’ నిధుల జమతో పాటు విద్యార్థి మిత్ర కిట్ల పంపిణీలోనూ జాప్యం జరిగే అవకాశం ఉందని అధికారులు తాజా మార్గదర్శకాల్లో వెల్లడించారు. పశ్చిమ ఆసియా యుద్ధ ప్రభావంతో కిట్ల తయారీ ఆలస్యం కావడంతో, ఈ నెలాఖరు లేదా వచ్చే నెల తొలి వారంలో వాటిని పంపిణీ చేయనున్నారు.

Join Telegram
Join Now

‘తల్లికి వందనం( Thalliki Vandanam )’ నిధులు జమ చేసేందుకు లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేయాలని ప్రభుత్వ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. నిధులు అందుకోవాలంటే విద్యార్థి తల్లి బ్యాంకు ఖాతాకు ఆధార్ లింక్, ఎన్‌పీసీఐ అనుసంధానంతో పాటు కేవైసీ అప్‌డేట్ తప్పనిసరిగా పూర్తి చేసుకోవాలి. ఏమైనా తప్పిదాలు ఉంటే గ్రామ సచివాలయాలకు వెళ్లి సరిచేసుకోవాలని, బ్యాంక్ ద్వారా ఎన్‌పీసీఐ యాక్టివేషన్ కాకపోతే వెంటనే ఇండియా పోస్టల్ పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్ తెరవాలని లబ్ధిదారులకు సూచించారు. కాగా, ప్రభుత్వ బడులు, కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకం ఈరోజు నుంచే అమలు కానుంది.

Ad
CHECK STATUS