జూలై మొదటి వారంలో ‘తల్లికి వందనం’

Thalliki Vandanam Latest News : ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిష్ఠాత్మక ‘తల్లికి వందనం’ పథకం నిధులను జూలై మొదటి వారంలో విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. గత విద్యాసంవత్సరం జూన్ 12న ఈ పథకాన్ని అమలు చేయగా, ఈసారి వివిధ కారణాల వల్ల వచ్చే నెలలోనే లబ్ధిదారులైన తల్లుల ఖాతాల్లో నగదు జమ చేయాలని భావిస్తున్నారు. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న సుమారు 68 లక్షల మంది విద్యార్థులకు ఈ పథకం వర్తించనుంది.

Join Telegram
Join Now

గత ప్రభుత్వం కుటుంబంలో ఒక్కరికే లబ్ధి చేకూర్చగా, ప్రస్తుత కూటమి ప్రభుత్వం బడికి వెళ్లే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికీ ఒక్కొక్కరికి రూ.13,000 చొప్పున ఆర్థిక సాయం అందించనుంది. ఇందుకోసం ప్రభుత్వంపై సుమారు రూ.9,000 కోట్ల ఆర్థిక భారం పడనుంది. కాగా, ఎండల తీవ్రత తగ్గుముఖం పట్టడంతో అకడమిక్ క్యాలెండర్ ప్రకారం జూన్ 12నే రాష్ట్రంలో పాఠశాలలు యథావిధిగా పునఃప్రారంభం కానున్నాయి. బడులు తెరిచిన తొలి రోజునే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలతో పాటు స్టూడెంట్ కిట్లలోని కొన్ని వస్తువులను పంపిణీ చేస్తారు.

Ad
CHECK STATUS