
NTR BHAROSA Pension Status | WhatsApp ద్వారా పెన్షన్ స్టేటస్ చెక్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింఛన్‌దారుల కోసం కొత్త డిజిటల్ సదుపాయం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపై పెన్షన్ సంబంధిత సమస్యల కోసం కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదు.
ప్రభుత్వం ప్రారంభించిన “మన మిత్ర WhatsApp సేవ (95523 00009)” ద్వారా పింఛన్ ఫిర్యాదులు, దరఖాస్తులు ఇంటి వద్ద నుంచే నమోదు చేసుకోవచ్చు.
| వివరాలు | సమాచారం |
|---|---|
| Service Name | మన మిత్ర WhatsApp సేవ |
| Official Number | 95523 00009 |
| Launched By | Government of Andhra Pradesh |
| Beneficiaries | అన్ని పెన్షన్‌దారులు & కొత్త దరఖాస్తుదారులు |
| Mode | WhatsApp ద్వారా |
• పెన్షన్ దారులు లేదా కొత్త దరఖాస్తుదారులు తమ సమస్యను 95523 00009 కు WhatsApp ద్వారా పంపాలి.
• అవసరమైన డాక్యుమెంట్లను నేరుగా WhatsAppలో అప్లోడ్ చేయవచ్చు.
• అప్లోడ్ చేసిన వివరాలు Social Security Pension Portal లోకి ఆటోమేటిక్‌గా చేరతాయి.
• జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్లు (PDs) డాక్యుమెంట్లను పరిశీలించి సమస్యను పరిష్కరిస్తారు.
• సమస్య పరిష్కారం పూర్తయిన తర్వాత నిర్ధారణ సమాచారం తిరిగి WhatsAppలో వస్తుంది.
• కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు.
• ఇంటి వద్ద నుంచే పెన్షన్ స్టేటస్ తెలుసుకోవచ్చు.
• ప్రభుత్వ పర్యవేక్షణలో పారదర్శకమైన సేవలు.
• పెన్షన్ సమస్యలు వేగంగా పరిష్కారం అవుతాయి.
క్రింద ఉన్న లింక్‌పై క్లిక్ చేస్తే నేరుగా మీ మొబైల్‌లో WhatsApp ఓపెన్ అవుతుంది.
ఈ WhatsApp సేవ పూర్తిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారిక సదుపాయం. తప్పుదారి పట్టించే కాల్స్ లేదా లింక్‌లను నమ్మవద్దు.