
Join Telegram
Join Now
Ntr Bharosa Pension december 31: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సామాజిక పింఛన్ దారులకు తీపికబురు అందించింది. నూతన సంవత్సర కానుకగా, జనవరి నెల ఎన్టీఆర్ భరోసా పింఛన్లను ఒకరోజు ముందుగానే, అంటే డిసెంబర్ 31నే పంపిణీ చేయాలని నిర్ణయించింది. జనవరి 1న న్యూ ఇయర్ కావడంతో ఈ మార్పు చేసినట్లు అధికారులు తెలిపారు.
ఈ మేరకు పంపిణీ కోసం సచివాలయ ఉద్యోగులు డిసెంబర్ 30నే బ్యాంకు నుంచి నగదు డ్రా చేసుకోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి. డిసెంబర్ 31న అందని పక్షంలో, మిగిలిన వారికి జనవరి 2న అందజేస్తారు. మరోవైపు, రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులు జనవరి 1, 2026 నుంచి ఫిబ్రవరి 28 లోపు తమ లైఫ్ సర్టిఫికెట్‌ను తప్పనిసరిగా సమర్పించాలని ప్రభుత్వం సూచించింది.