PM Kisan New Farmer Registration 2025

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (PM Kisan Samman Nidhi Yojana) కింద అర్హులైన రైతులకు కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం రూ.6,000 ఆర్థిక సహాయం అందిస్తోంది. ఈ మొత్తం రూ.2,000 చొప్పున మూడు విడతలుగా నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతుంది.
2025 నుంచి కొత్త రైతుల రిజిస్ట్రేషన్ విధానం పూర్తిగా మారింది. తాజా విధానాన్ని సరిగా పాటించకపోతే అప్లికేషన్ తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది. అందుకే కొత్త రైతులు అప్లై చేసే ముందు పూర్తి ప్రక్రియ తెలుసుకోవడం చాలా అవసరం.
PM Kisan Scheme – Overview
| అంశం | వివరాలు |
|---|---|
| పథకం పేరు | PM Kisan Samman Nidhi Yojana |
| ప్రారంభించినది | కేంద్ర ప్రభుత్వం |
| లబ్ధి మొత్తం | ₹6,000 సంవత్సరానికి |
| చెల్లింపు విధానం | ₹2,000 × 3 విడతలు |
| అప్లికేషన్ మోడ్ | ఆన్‌లైన్ |
| అర్హులు | భూమి ఉన్న రైతులు |
| అధికారిక వెబ్‌సైట్ | pmkisan.gov.in |
PM Kisan New Farmer Registration 2025 – ఎవరు అప్లై చేయాలి?
భూమి ఉన్న రైతులు మరియు ఇప్పటివరకు PM కిసాన్ లబ్ధి పొందని వారు కొత్తగా నమోదు చేసుకోవచ్చు. అలాగే కొత్త రైతు రిజిస్ట్రేషన్ చేయాలనుకునే వారు మరియు Farmer Registry పూర్తిచేసిన రైతులు కూడా అర్హులే.
ఒక ముఖ్యమైన నియమం ఏమిటంటే, ఒక కుటుంబంలో ఒక్కరికి మాత్రమే PM కిసాన్ లబ్ధి ఉంటుంది.
PM Kisan New Registration 2025 – Step-by-Step ప్రక్రియ
- ముందుగా pmkisan.gov.in అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లాలి. హోమ్‌పేజ్‌లో ఉన్న Farmer Corner విభాగంలో New Farmer Registration ఎంపికను ఎంచుకోవాలి.
- అక్కడ ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ నమోదు చేసి, రాష్ట్రం సెలెక్ట్ చేయాలి. క్యాప్చా ఎంటర్ చేసి Get OTP క్లిక్ చేస్తే మొబైల్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ వెరిఫికేషన్ పూర్తయ్యాక Farmer Registry ID ఆటోమేటిక్‌గా ఫెచ్ అవుతుంది.
- తర్వాత ఆధార్‌కు లింక్ అయిన మొబైల్‌కు వచ్చే ఓటీపీ ద్వారా Aadhaar e-KYC పూర్తి చేయాలి. ఆపై వ్యక్తిగత వివరాలు నమోదు చేయాలి. ఇందులో కేటగిరీ వివరాలు, రేషన్ కార్డు నెంబర్ (ఉంటే), అలాగే PM Kisan Maandhan – NO ఎంపిక చేయాలి.
- తదుపరి దశలో భూమి వివరాలు నమోదు చేయాలి. భూమి మీ సొంతమా లేదా జాయింట్ ఓనర్షిప్‌లో ఉందా అనే ఎంపిక, ఖాతా లేదా సర్వే నెంబర్, 2019 తర్వాత భూమి మీ పేరుకు వచ్చిందా అనే సమాచారం ఇవ్వాలి. సాగు ప్రారంభ తేదీ కూడా నమోదు చేయాలి.
- చివరిగా బ్యాంక్ పాస్‌బుక్ లేదా 1B డాక్యుమెంట్‌ను PDF ఫార్మాట్‌లో (200KB లోపల) అప్లోడ్ చేసి, అన్ని వివరాలు చెక్ చేసి Submit చేయాలి. అప్లికేషన్ Pending for Verification స్టేటస్‌లో ఉంటుంది.
✅ Important Link’s
PM Kisan అప్లయ్ లింక్ : Click Here
PM Kisan న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ స్టేటస్ : Click Here
PM Kisan Application Status Check
అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవడానికి మళ్లీ Farmer Corner లోకి వెళ్లి Self Registered Farmer Status ఎంపికను ఎంచుకోవాలి. అక్కడ ఆధార్ నెంబర్ మరియు క్యాప్చా ఎంటర్ చేస్తే మీ అప్లికేషన్ స్థితి కనిపిస్తుంది.
PM Kisan డబ్బులు ఎప్పుడు వస్తాయి?
అధికారులు మీ అప్లికేషన్‌ను పూర్తిగా వెరిఫై చేసిన తర్వాత, మీ పేరు లబ్ధిదారుల జాబితాలో చేరుతుంది. ఆ తర్వాత వచ్చే విడత నుంచే రూ.2,000 చెల్లింపు ప్రారంభమవుతుంది.
ఆన్‌లైన్ అప్లికేషన్ తెలియని రైతులకు సహాయం
ఆన్‌లైన్‌లో అప్లై చేయడం తెలియని రైతులు తమకు సమీపంలోని రైతు భరోసా కేంద్రం లేదా CSC సెంటర్ ద్వారా కూడా PM కిసాన్ రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు.