
Table of Contents
వాలంటీర్స్ కి మళ్ళీ షాక్: వాలంటీర్ల వాట్సప్, టెలిగ్రాం గ్రూపులు తొలగించాలి?
వాలంటీర్స్ : ప్రభుత్వ సంక్షేమ పథకాల వివరాల సమాచారం క్షణాల్లో ప్రజలందరికీ తెలియజేసేందుకు ఏర్పాటు చేసిన వలంటీర్ల వాట్సాప్, టెలిగ్రాం తది తర గ్రూపులన్నింటినీ తక్షణమే తొలగించాలంటూ గ్రామ వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్ శివ ప్రసాద్ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు.
ఆదివారం సెలవు రోజు అయినప్పటికీ శాఖ డైరెక్టర్ ఫోన్ మెసేజ్ ద్వారా హడావుడిగా ఈ మేరకు ఆదే శాలు జారీ చేశారు. తమ ఆదేశాలు తక్షణం క్షేత్ర స్థాయిలో అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని కలె క్టర్లకు సూచించారు.
ఆయా వలంటీర్ల వాట్సాప్ గ్రూపుల తొలగించిన వివరాలను అధికారులు తనకు సోమవారం ఐదు గంటల లోపు తెలియజే యాలని కూడా ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు.
- Thalliki Vandanam Scheme 2025: తల్లికి వందనం పై ప్రభుత్వం కీలక నిర్ణయం
- Thalliki Vandanam Release Date 2025: తల్లికి వందనం రిలీజ్ డేట్ ప్రకటన
- Thalliki Vandanam Scheme 2025: రిలీజ్ డేట్ ప్రకటించిన మంత్రి
- Today history: చరిత్రలో ఈరోజు జనవరి-20-2025
- Today News: 19 డిసెంబర్ 2024
అంతేగాక ప్రజలను కూడా వాట్సాప్ గ్రూపుల నుంచి ఎగ్జిట్ అయ్యేలాగ అప్రమత్తం చేయాలన్నారు. ఉన్నతాధికారుల నుంచి అందిన ఆదేశాలతో జిల్లా లోనూ గ్రామ వార్డు సచివాలయాల శాఖ ఇన్ చార్జిలు హడావుడిగా ఆ సమాచారాన్ని మండల, మున్సిపల్ స్థాయి అధికారులకు పంపారు.
కాగా,ఈ ఏడాది మార్చి 16న ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన అనంతరం కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఆదేశాల మేరకు రాష్ట్రంలోని వలంటీర్ల అందరికీ అప్పట్లో ప్రభుత్వం అందజేసిన మొబైల్ ఫోన్లు, సిమ్కార్డులను గ్రామ వార్డు సచివాలయాల శాఖ స్వాధీనం చేసుకుంది. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత కూడా ఇప్పటి వరకు వలంటీర్లు ఎవ్వరికీ ఆ ఫోన్లను, సిమ్కార్డులను తిరిగి అందజేయలేదు.
Download Volunteer Groups Delete Orders
గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఆదేశాలు లేకుండానే క్లస్టర్ ప్రజలతో ఏర్పాటు చేసిన వాట్సాప్ & టెలిగ్రామ్ గ్రూపులను రేపు సాయంత్రం 05:00 లోపు డిలీట్ చేయాలని, ఆ క్లస్టర్ వాట్సాప్ గ్రూప్స్ నుండి వెంటనే EXIT అయ్యేలా ప్రజలకు అవగాహన కల్పించాలని తగు ఆదేశాలు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం
గమనిక :: పైన ఉన్న లింక్ ను క్లిక్ చేసుకొని వాలంటీర్స్ గ్రూప్స్ రిమూవ్ ఆర్డర్స్ Download చేసుకోండి.
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇