Table of Contents
Anganwadi Jobs 2024: మహిళలకు శుభవార్త అంగన్వాడి జాబ్స్ రిలీజ్
మన రాష్ట్రంలోని మహిళలకు శుభవార్త అని చెప్పవచ్చును. ( Anganwadi Jobs ) 7వ తరగతి, 10వ తరగతి అర్హతతో సొంత జిల్లాలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న మహిళలకి శుభవార్త… అని చెప్పవచ్చును.. ఈ పేజీలో మనము ఎన్ని అంగన్వాడి జాబ్స్ ఉన్నాయి, ఎలా దరఖాస్తు చేసుకోవాలి పూర్తి వివరాలు తెలుసుకుందాం..
మొత్తం పోస్టుల సంఖ్య ::
- మొత్తం పోస్టులో ఖాళీల సంఖ్య :: 68
పోస్టుల వివరాలు ::
ఈ క్రింద తెలిపిన ప్రకారం పోస్టులు ఉన్నాయి..
WhatsApp Group
Join Now
S.NO | Name of the Posts | Number of Posts |
1 | అంగన్వాడీ టీచర్ ( AWW ) | 06 |
2 | మినీ అంగన్వాడీ టీచర్ ( Mini – AWW ) | 02 |
3 | అంగన్వాడి సహాయకురాలు / ఆయాలు ( AWH ) | 60 |
విద్యార్హత ::
- అభ్యర్థి తప్పనిసరిగా ఉండాలి..
- అంగన్వాడి కార్యకర్త పోస్టు కొరకు ( AWW ) 10వ తరగతి పాస్ అయి ఉండాలి..
- అంగన్వాడి సహాయకురాలు & మినీ అంగన్వాడి కార్యకర్త పోస్టు కొరకు 7వ తరగతి తప్పనిసరిగా అర్హత కలిగి ఉండాలి.
- అలాగే వివాహితులు అయితే స్థానికంగా గ్రామ స్థానికులై ఉండాలి..
వయస్సు ::
- 01-07-2024 నాటికి 21 సంవత్సరములు పూర్తిచేసుకుని 35 సంవత్సరాలకు మించి వయస్సు ఉండరాదు.
- 21 సంవత్సరములు అభ్యర్థులు లభ్యం కానీ ఎడల 18 సంవత్సరాలు నిండిన అభ్యర్థుల దరఖాస్తులను పరిశీలించబడును.
- ఎవరైనా 18 సంవత్సరాల నుండి అభ్యర్థులు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చును.
- ఎస్సీ / ఎస్టి ప్రాంతములలో 21 సంవత్సరాలు నిండిన అభ్యర్థులు లేకపోతే 18 సంవత్సరాలు నిండిన అభ్యర్థులు కూడా అర్హులవుతారు.
- ఎస్సీ / ఎస్టి హ్యాబిటేషన్ ల కొరకు కేటాయించిన అంగన్వాడీ కేంద్రాలలో ( మెయిన్ / మిని ) ఎస్సీ / ఎస్టీలను మాత్రమే ఎంపిక చేస్తారు.
- అంగన్వాడీ కార్యకర్త / మినీ అంగన్వాడి కార్యకర్త మరియు అంగన్వాడి సహాయకుల పోస్టులకు ఎస్సీ / ఎస్టి హ్యాబిటేషన్ నందు స్థానికైనం గా కలిగిన అభ్యర్థులు మాత్రమే అర్హులు.
సెలక్షన్ ప్రాసెస్ ::
- వచ్చిన దరఖాస్తులను పూర్తిగా పరిశీలించి అర్హత ప్రమాణాలు / స్థానికంగా ఆధారంగా short లిస్ట్ చేసి , రూల ఆఫ్ రిజర్వేషన్ రోస్టర్ జాబితా …. ప్రాతిపదికన ఎంపిక ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
జీతభత్యాలు ::
- అంగన్వాడీ టీచర్ ( AWW ) కు రూ. 11,500/-
- మినీ అంగన్వాడీ టీచర్ ( Mini – AWW ) కు రూ. 9,000/-
- అంగన్వాడి సహాయకురాలకు రూ. 7,000/-
అప్లై చేసుకునే ప్రాసెస్ ::
- కలిసివులైన అభ్యర్థులందరూ అప్లికేషన్ పూర్తిగా ఆఫ్ లైన్ లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు ::
- ఈ అంగన్వాడికి సంబంధించి మీరు ఏ జాబ్ అప్లై చేయాలన్న ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ అనేది ఉండదు… టోటల్గా ఫ్రీగా అప్లై చేయొచ్చు..
కావలసిన డాక్యుమెంట్స్ ::
దరఖాస్తుదారులు తమ దరఖాస్తు తో పాటు గెజిటెడ్ ఆఫీసర్ చేత అటెస్ట్ చేయబడిన ధ్రువీకరణ పత్రాలను జతచేయాలి.
- పుట్టిన తేదీ / వయసు ధ్రువీకరణ పత్రం
- స్థానిక నివాసం కోసం . నేటివిటీ సర్టిఫికెట్ / రెసిడెన్సి సర్టిఫికెట్ / ఆధార్ కార్డ్ / రేషన్ కార్డ్ మొదలగునవి.
- పదవ తరగతి మార్కుల లిస్ట్
- క్యాస్ట్ సర్టిఫికెట్
- దివ్యాంగులైతే సదరం సర్టిఫికెట్
- వితంతు అయినచో తగు సర్టిఫికెట్.
- ఇటీవల ఫోటో సిగ్నేచర్
Anganwadi Jobs ఇంపార్టెంట్ డేట్స్
- Offline దరఖాస్తు ప్రారంభం తేదీ :: 10-10-2024
- Offline దరఖాస్తు చివరి తేదీ :: 21-10-2024
ఈ నోటిఫికేషన్ ఏ జిల్లా నుండి ::
- జిల్లా మహిళా & శిశు సంక్షేమ శాఖ నంద్యాల జిల్లా నుండి ఈ అంగన్వాడి జాబ్స్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది.
ఎక్కడ అప్లై చేయాలి ::
- ఈ అంగన్వాడి జాబ్స్ కి సంబంధించి జిల్లా మహిళా & శిశు సంక్షేమ & సాధికారత అధికారిణి, నంద్యాల జిల్లా.
అధికారిక వెబ్సైట్ :: https://nandyal.ap.gov.in/
Notification PDF | Click Here |
Apply Application Form | Click Here |
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇