Annadata Sukhibhava Scheme 2024 Full Details

Annadata Sukhibhava

Annadata Sukhibhava Scheme 2024 Full Details

Annadata Sukhibhava: ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం మరో పథకం పేరును మార్చింది. ఇప్పటికే పలు పథకాల పేర్లు మార్చిన ఈ ప్రభుత్వం, తాజాగా వైఎస్ఆర్ రైతు భరోసా పేరును కూడా మార్చింది. ఇప్పుడు వైఎస్ఆర్ రైతు భరోసా పేరును “అన్నదాత సుఖీభవ”గా మార్చారు. దీనికి సంబంధించి వెబ్‌సైట్‌లో మార్పులు చేశారు. మరొకవైపు, అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి సంవత్సరం రైతులకు రూ. 20000 ఆర్థిక సాయం అందిస్తామని చంద్రబాబు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు.

అన్నదాత సుఖీభవ పథకాన్ని 2019లోనే చంద్రబాబు ప్రభుత్వం ప్రారంభించింది. 2019 ఎన్నికల ముందు ఈ పథకాన్ని ప్రకటించిన టీడీపీ ప్రభుత్వం, కేంద్రం అందించే పీఎం కిసాన్ యోజనతో పాటు అమలు చేసింది. పీఎం కిసాన్ యోజన కింద ఏడాదికి రూ.6000 పెట్టుబడి సాయంగా అందించగా, ఆ రూ.6000కు రాష్ట్రం ఇచ్చే రూ.9000 కలిపి మొత్తం రూ.15000 రైతులకు పెట్టుబడి సాయంగా అందించేలా పథకం రూపొందించారు. అయితే, ఈ పథకం 2019 ఫిబ్రవరిలో ప్రారంభమైనప్పటికీ, అదే ఏడాది జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలైంది.

WhatsApp Group Join Now
Scheme Name Annadata Sukhibhava
Launched By TDP-JSP-BJP
StateAndhrapradesh
Amount20,000
Benifit ToAP Farmers
Application Process Online / Offline
Official Website Not Available

2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, వైఎస్ఆర్ రైతు భరోసా కింద రైతులకు పెట్టుబడి సాయం అందించడం ప్రారంభించింది. పీఎం కిసాన్ యోజన కింద ఏడాదికి అందించే రూ.6000లకు అదనంగా వైసీపీ ప్రభుత్వం రూ.7500ను కలిపి, మొత్తం రూ.13,500ను రైతులకు సాయం చేస్తూ వచ్చింది. ఈ మొత్తాన్ని ఏడాదిలో మూడు విడతలుగా అందిస్తున్నారు. అయితే, 2024 ఎన్నికల్లో విజయం సాధించి తిరిగి అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఈ పథకం పేరును మళ్లీ అన్నదాత సుఖీభవగా మార్చింది.

ఇంకా, ఎన్నికల ప్రచారం సమయంలో అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు ఏడాదికి రూ.20000 సాయం అందిస్తామని టీడీపీ కూటమి వాగ్దానం చేసింది. వైఎస్ఆర్ రైతు భరోసా పేరును అన్నదాత సుఖీభవగా మార్చిన తర్వాత, ఈ పథకం అమలుపై త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది..

Annadata Sukhibhava Scheme Total Amount

రైతు భరోసా పథకం పేరు మార్పు జరిగింది. ఇప్పుడు ఈ పథకాన్ని *అన్నదాత సుఖీభవ* గా మార్చారు, దీనికి అనుగుణంగా వెబ్‌సైట్‌లో కూడా మార్పులు చేశారు. *అన్నదాత సుఖీభవ* పథకం కింద ఇప్పుడు 20,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించనున్నారు. ఇందులో కేంద్రం వాటా 6,000 రూపాయలు, 14,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది.

Annadata Sukhibhava Scheme Benifits

అన్నదాత సుఖీభవ పథకం అనేక ప్రయోజనాలు కలిగి ఉంది:

Andhra Pradesh Check Ration Card Details Online
Andhra Pradesh Check Ration Card Details Online – 2024
  • ఇది రాష్ట్రంలోని రైతులను శక్తివంతం చేస్తుంది.
  • వారి జీవనోపాధిని మెరుగుపరుస్తుంది.
  • రాష్ట్రంలోని వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేస్తుంది.

Annadata Sukhibhava Scheme Eligibility Criteria

ఆంధ్రప్రదేశ్ అన్నదాత సుఖీభవ పథకం కింద సాయాన్ని పొందడానికి అర్హతలు ఈ విధంగా ఉన్నాయి:

  • దరఖాస్తుదారుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్థిర నివాసి కావాలి.
  • వ్యవసాయ భూమి కలిగి ఉన్న వ్యక్తులు లేదా అద్దె రైతులు ఈ పథకానికి అర్హులు.
  • ఈ పథకం కేవలం చిన్న మరియు సన్నకారు రైతులకు మాత్రమే వర్తిస్తుంది.

Annadata Sukhibhava Scheme Documents Required

  • నివాస ప్రమాణం
  • గుర్తింపు ప్రమాణం
  • ఆధార్ కార్డు
  • బ్యాంకు ఖాతా వివరాలు
  • ఫార్మ్ ల్యాండ్ పేపర్లు
  • పాస్పోర్ట్ సైజ్ ఛాయాచిత్రాలు

Annadata Sukhibhava Scheme FAQ

Q1: What is the amount provided under the AP Annadata Sukhibhava scheme for 2024?

The newly elected Chief Minister of Andhra Pradesh has introduced Annadata as part of their Super Six schemes during the 2024 elections. All farmers enrolled in this scheme are eligible for Annadata Sukhibhava. Under this initiative, each farmer receives Rs. 20,000 distributed in three installments.

How can we verify the status of our payment in the AP Annadata Sukhibhava scheme?

To check the payment status in the Annadata scheme, follow these steps:

Visit the official website for the Annadata scheme through Google.

Chandranna Bima
Chandranna Bima Status: 5 లక్షల స్టేటస్ వెంటనే తెలుసుకోండి!

Navigate to the homepage and select “Payment Status.

“Enter your application details and verify using the OTP sent to your registered mobile number.

Click “Submit” to view your payment status.

Hot Topics 🔥: Annadata Sukhibhava Scheme 2024 Full Details

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now

1 thought on “Annadata Sukhibhava Scheme 2024 Full Details”

  1. అన్నదాత లకి పెట్టుబడి ఎప్పుడు ఇస్తారు

Comments are closed.

error: Content is protected !!