
Table of Contents
Ap Cabinet Decisions 2024: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు!
Ap Cabinet Decisions 2024 : ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరుగుతోంది. క్యాబినెట్ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించి ఆమోదం తెలపనున్నారు..
స్థానిక సంస్థలు, సహకారం సంఘాల ఎన్నికల్లో ముగ్గురు పిల్లలు ఉంటే పోటీకి అనర్హులు అనే నిబంధనను రద్దు చేసే అవకాశముంది. దీనిపై భేటీలో చర్చిస్తున్నారు. వైకాపా హయాంలో ఎక్సైజ్ శాఖలో జరిగిన అవకతవకలు, మత్స్యకారులకు నష్టం చేకూర్చేలా గతంలో తీసుకొచ్చిన 217 జీవో రద్దుపై చర్చ జరుగుతోంది. మావోయిస్టులపై నిషేధం పొడిగిస్తూ క్యాబినెట్‌లో తీర్మానం చేసే అవకాశముంది..
- Thalliki Vandanam Scheme 2025: తల్లికి వందనం పై ప్రభుత్వం కీలక నిర్ణయం
- Thalliki Vandanam Release Date 2025: తల్లికి వందనం రిలీజ్ డేట్ ప్రకటన
- Thalliki Vandanam Scheme 2025: రిలీజ్ డేట్ ప్రకటించిన మంత్రి
- Today history: చరిత్రలో ఈరోజు జనవరి-20-2025
- Today News: 19 డిసెంబర్ 2024
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు
- మావోయిస్టులపై నిషేధం మరో ఏడాది పొడిగింపు.
- పశుసంవర్ధకశాఖ, మత్స్యశాఖలు విడుదల చేసిన, జీవో నెంబర్ 217, 144 జీవోలు రద్దు
- రిజర్వాయర్, చెరువుల్లో పబ్లిక్ ఆక్షన్ రద్దు చేసి, స్థానిక మత్స్యకారులకు అవకాశం
- స్థానిక సంస్థలు, పంచాయతీరాజ్ ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధన మినహాయించుతూ తీర్మానం
- కొత్త మెడికల్ కాలేజిల్లో 100 సీట్లతో MBBS కోర్సులు
- అక్టోబర్ 1 నుంచి ఏపీలో కొత్త మద్యం పాలసీ
- అందుబాటు ధరల్లో నాణ్యమైన మద్యం సరఫరాకు నిర్ణయం
- పట్టాదారు పాస్పుస్తకాలపై ఏపీ ప్రభుత్వ ముద్ర
- భూఅక్రమాలు వెలికితీయాలని ఏపీ కేబినెట్ నిర్ణయం.
- జిల్లాల్లో రెవెన్యూ అధికారులు పర్యటించాలని ఆదేశం. 22 ఏ ఫిర్యాదులపై మూడు నెలల్లో పరిష్కారం. అప్పటివరకు 22ఏ భూముల రిజిస్ట్రేషన్లు నిలిపివేత ఇప్పటికే పూర్తయిన రిజిస్ట్రేషన్లపై విచారణ
కొత్త కార్యక్రమం ప్రకటించిన సీఎం చంద్రబాబునాయుడు.
రాష్ట్రంలో ప్రతి నెలా ఒకటో తేదీన ‘పేదల సేవలో’ కార్యక్రమం అమలు చేయనున్నట్లు CM చంద్రబాబు చెప్పారు. పెన్షన్ల పంపిణీలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. ప్రజల కష్టాలు తెలుసుకుని పేదరికం లేని సమాజం కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. OCT 2న రాష్ట్రానికి సంబంధించిన 2047 విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేయబోతున్నాం.100 రోజుల టార్గెట్ గా పనులు చేస్తున్నాం. సూపర్ సిక్స్ హామీలకు కట్టుబడి ఉన్నాం’ అని తెలిపారు.
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇