
AP Free Sand Policy 2024 Full Details
AP Free Sand Policy : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూలై 8 నుండి ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేయడం ప్రారంభించింది. ఈ విధానం జూలై 8 ఉదయం 6:00 గంటల నుండి అమల్లోకి వచ్చింది.ఇంతకుముందు ఉన్న ఇసుక విధానాన్ని మారుస్తూ, ఇసుకపై ఎటువంటి డబ్బు వసూలు చేయకుండా కొత్త విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది.
గత ప్రభుత్వ కాలంలో ఇసుక కోసం లారీకి గరిష్టంగా 40 వేలు, ట్రాక్టర్ కోసం 13 వేల వరకు చెల్లించాల్సి వచ్చేది. కొత్త పాలసీతో ఇసుక ఉచితం చేయడంతో ప్రజలపై ఆర్థిక భారం తగ్గుతుందని ప్రభుత్వం తెలిపింది. పూర్తి విధివిధానాలు కింద ఇవ్వబడ్డాయి.
Table of Contents
- Thalliki Vandanam Scheme 2025: తల్లికి వందనం పై ప్రభుత్వం కీలక నిర్ణయం
- Thalliki Vandanam Release Date 2025: తల్లికి వందనం రిలీజ్ డేట్ ప్రకటన
- Thalliki Vandanam Scheme 2025: రిలీజ్ డేట్ ప్రకటించిన మంత్రి
- Today history: చరిత్రలో ఈరోజు జనవరి-20-2025
- Today News: 19 డిసెంబర్ 2024
ఉచిత ఇసుక ఎలా పొందాలి
ఉచిత ఇసుక కోసం ఈ క్రింది సూచనలు పాటించాలి:
- సహేతుకత పట్టికలు: శాండ్ డిపోకు వెళ్లి ఆధార్, ఫోన్ నంబర్, అడ్రస్, వాహనం నంబర్ నమోదు చేయాలి.
- ఆన్లైన్ చెల్లింపు: అధికారి నిర్ణయించిన లోడింగ్, ట్రాన్స్పోర్ట్ ఫీజును కేవలం ఆన్లైన్ ద్వారానే చెల్లించాలి. ఇందుకోసం QR కోడ్లు ఏర్పాటు చేశారు.
- పనివేళలు: ఇసుక డిపోలు ఉదయం 6:00 నుంచి సాయంత్రం 6:00 వరకు పనిచేస్తాయి.
- మొదటి ప్రాధాన్యత: స్టాక్ ఉన్నంత వరకు, ముందుగా వచ్చిన వారికి ఇసుక అందజేస్తారు.
- వెబ్‌సైట్ సమాచారం: ఇసుక డిపో ఎక్కడ ఉందో, ఎంత స్టాక్ ఉందో తెలుసుకోవడానికి కింద ఉన్న వెబ్‌సైట్‌ను చూడండి.
AP Free Sand Policy More Details

- ప్రజలు ఇసుక ఉచితంగా పొందవచ్చు అయినప్పటికీ:తవ్వినందుకు టన్నుకు ₹30 చెల్లించాలిసినరేజ్ చార్జీల కింద టన్నుకు ₹88 చెల్లించాలినిర్వహణ కింద మరో ₹20 చెల్లించాలి.
- డిజిటల్ పద్ధతిలో ఈ మొత్తాన్ని స్వీకరించి వెంటనే రసీదు ఇస్తారు.
- జిల్లాల వారీగా రీచ్‌ను బట్టి ధరలను నిర్ధారించి ఆయా ఇసుక పాయింట్లలో ప్రదర్శిస్తారు.
- సీనరేజ్ చార్జీల కింద వసూలు చేసిన మొత్తాన్ని ప్రభుత్వం మున్సిపల్, పంచాయితీ ఖాతాలకు చెల్లిస్తుంది.నిర్వహణ అమౌంట్‌ను మైంటెనెన్స్ కింద సెక్యూరిటీ మరియు వే బిల్ ఖర్చులకు వినియోగిస్తారు.
- ప్రజలు ఇసుక రవాణా ఖర్చులు తామే భరించాలి.
- చిన్న నదులు, చెరువులు ఉన్న చోట్ల ప్రజలు ఎడ్ల బండుల్లో కూడా ఇసుక తరలించుకోవడానికి వెసులుబాటు కల్పించారు.
- ఒక వ్యక్తికి ఒక రోజులో 20 మెట్రిక్ టన్నుల ఇసుకను పొందే అవకాశం ఉంది.
- అక్రమాలు, ఫిర్యాదులకు తావు లేకుండా ప్రభుత్వం జిల్లాల వారీగా టోల్ ఫ్రీ నంబర్లను ఏర్పాటు చేసింది.
- ఇసుక తరలింపు ఇన్‌చార్జీలుగా VRO, VRA, గ్రామ వార్డు సచివాలయ సిబ్బందిని నియమిస్తారు.జిల్లాను బట్టి జిల్లా స్థాయి కలెక్టర్ల ఆధ్వర్యంలో ఏ అధికారులు ఇన్‌చార్జిలుగా ఉంటారో నిర్ణయిస్తారు.
- ఇసుక పొందేందుకు లబ్ధిదారులు తమ ఆధార్ నెంబర్ మరియు మొబైల్ నెంబర్ తెలపాలి.
- కలెక్టర్ల స్థాయిలో జాయింట్ ఖాతాను ఏర్పాటుచేసి ప్రజల నుండి స్వీకరించిన డబ్బులను తాత్కాలికంగా అందులో జమ చేస్తారు.
Official Website :- CLICK HERE
Read more: AP Free Sand Policy 2024 Full Details- Thalliki Vandanam Scheme 2025: తల్లికి వందనం పై ప్రభుత్వం కీలక నిర్ణయం
- Thalliki Vandanam Release Date 2025: తల్లికి వందనం రిలీజ్ డేట్ ప్రకటన
- Thalliki Vandanam Scheme 2025: రిలీజ్ డేట్ ప్రకటించిన మంత్రి
- Today history: చరిత్రలో ఈరోజు జనవరి-20-2025
- Today News: 19 డిసెంబర్ 2024
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇