
Ap Ration Card Holders Benifits : రాష్ట్రంలో రేషన్ కార్డు దారులకు ప్రభుత్వం తీపికబురు అందించింది. రేషన్ వస్తువుల్లో లోటు పాట్లను సరిచేసి మళ్లీ వాటిని బియ్యంతో పాటుగా అందించబోతోంది. ఈ మేరకు సెప్టెంబర్ నెల నుంచి పంచదారను రేషన్ లో యథావిధిగా లబ్దిదారులకు పంపిణీ చేయనున్నారు.
Table of Contents
అలాగే కొన్ని జిల్లాల్లో గోధుమ పిండి, రాగులు కూడా పేదలకు దశలవారీగా రేషన్ లో అందించే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. అక్టోబర్ నుంచి మిగిలిన సరుకుల్ని కూడా పంపిణీ చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.. రేషన్ కార్డుదారులకు బియ్యంతోపాటు పంచదార సరఫరా చేసేందుకు పౌరసరఫరాల శాఖ చర్యలు తీసుకుంది. అధికారులు ప్రస్తుతం సరైన తూకంతో పంచదార ప్యాకెట్లను సిద్ధం చేశారు. అంతేకాదు చక్కెర ప్యాకెట్ రంగు మార్చి.. ఇప్పటికే పౌరసరఫరాల గోడౌన్ల నుంచి రేషన్ షాపులకు బియ్యం, పంచదార సరఫరా చేస్తున్నారు. సెప్టెంబరులో బియ్యంతో పాటుగా పంచదార ఇచ్చేందుకు సన్నాహాలు చేశారు. జిల్లాల్లో ఉన్న నిల్వల మేరకు మాత్రమే పంచదార, రాగులు, గోధుమపిండి పంపిణీ జరగనుంది..
- Thalliki Vandanam Scheme 2025: తల్లికి వందనం పై ప్రభుత్వం కీలక నిర్ణయం
- Thalliki Vandanam Release Date 2025: తల్లికి వందనం రిలీజ్ డేట్ ప్రకటన
- Thalliki Vandanam Scheme 2025: రిలీజ్ డేట్ ప్రకటించిన మంత్రి
- Today history: చరిత్రలో ఈరోజు జనవరి-20-2025
- Today News: 19 డిసెంబర్ 2024
బియ్యంతో పాటు పంచదార,రాగులు, గోధుమ పిండి పంపిణీ
బియ్యం మినహా ఇతర అన్ని సరుకులనూ గత ప్రభుత్వం ఎంపిక చేసిన సంస్థలు, కంపెనీలే సరఫరా చేస్తున్నాయి. ప్రభుత్వం వాటి స్థానంలో కొత్తవాటిని ఎంపిక చేసి వాటి ద్వారా పంపిణీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. గోధుమపిండి, కందిపప్పు సరఫరా టెండర్ల దశలో ఉండటంతో.. ఆ ప్రక్రియ పూర్తైన తర్వాత అక్టోబరు నుంచి వాటిని పూర్తి స్థాయిలో పంపిణీ చేస్తామని పౌరసరఫరాలశాఖ అధికారులు చెబుతున్నారు.
ఒక్కొక్క రేషన్ కార్డుకు పంచదార ప్యాకెట్ (అరకేజీ) చొప్పున రూ.17కు ఇస్తారు. అదే ఏఏవై (అంత్యోదయ అన్న యోజ) కార్డుకు కేజీ రూ.13కు అందిస్తారు. మరోవైపు రాగుల్ని కొన్ని జిల్లాలకు మాత్రమే కేటాయించారు. వీటిని తీసుకునేందుకు లబ్దిదారుల నుంచి వచ్చే డిమాండ్కు అనుగుణంగా ఇండెంట్ పెంచుతామని అధికారులు పేర్కొంటున్నారు.
అక్టోబర్ నుంచి కందిపప్పు పంపిణీకి అవకాశం
కేజీ నుంచి మూడు కేజీల వరకు ఉచితంగా రేషన్లో రాగులు తీసుకోవచ్చని, రాగులు ఎన్ని కేజీలు తీసుకుంటే అన్ని కేజీలు బియ్యం తగ్గించి లబ్దిదారులకు అందిస్తామని చెబుతున్నారు. అయితే కందిపప్పు, గోధుమ పిండిని అక్టోబర్ నెల నుంచి పంపిణీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సెప్టెంబర్ నెలకు సంబంధించి 1,48,43,671 కార్డుదారులకు చెందిన 4,31,81,370 మందికి సరుకులను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇదిలా ఉండగా గత వారం జరిగిన కేబినెట్ సమావేశంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా అదనంగా రేషన్ షాపుల్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది.
- Thalliki Vandanam Scheme 2025: తల్లికి వందనం పై ప్రభుత్వం కీలక నిర్ణయం
- Thalliki Vandanam Release Date 2025: తల్లికి వందనం రిలీజ్ డేట్ ప్రకటన
- Thalliki Vandanam Scheme 2025: రిలీజ్ డేట్ ప్రకటించిన మంత్రి
- Today history: చరిత్రలో ఈరోజు జనవరి-20-2025
- Today News: 19 డిసెంబర్ 2024
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇