Ap Volunteeers Latest News: పోరాటానికి వాలంటీర్స్ సిద్ధం!
Ap Volunteers Latest News: 31న రాష్ట్రస్థాయి బేటి.. భవిష్యత్ కార్యాచరణ పై ప్రణాళిక.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాలంటీర్స్ పరిస్థితి అయోమయం గా ఉంది.. అసలు వాలంటీర్స్ వ్యవస్థని కొనసాగిస్తారా లేదా.. అనే ప్రశ్న ప్రతి ఒక్కరు కి సందేహాత్మకంగా ఉంది..
వాలంటీర్లు న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఎంతో కీలకంగా ఉన్న వాలంటీర్ల కొనసాగింపుపై కూటమి ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంతో వారు ఆందోళన చెందుతున్నా రు. రెండు నెలలుగా జీతాలు కూడా ఇవ్వకుండా, పనులు చెప్పకుండా పక్కన పెట్టడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ ఉద్యోగాలు కొనసాగించాలని పలుమార్లు అధికారులు, ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు ఇవ్వడంతోపాటు సీఎం, డిప్యూటీ సీఎం, ఇతర మంత్రులకు ఎక్స్ వేదికగా ట్వీట్స్ చేశారు. అయినా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో ఉద్యమం దిశగా అడుగులు వేస్తున్నారు.
- Top GK questions in Telugu with answers for competitive exams || General Knowledge Bits in Telugu
- Aadhar Bank Link Status : ఇక్కడ DBT ఉంటేనే డబ్బులు వస్తాయి!
- General Knowledge Questions – Simple Quiz Questions
- Free Gas Subsidy Status మీకు ఇంకా ఉచిత గ్యాస్ డబ్బులు రాలేదా! ఇలా మీ స్టేటస్ చెక్ చేసుకోండి
- NPCI Link Bank Account Online 2024: ఇంట్లో నుండి మీ ఆధార్ కార్డు కి బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకోండి!
అయినా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో ఉద్యమం దిశగా అడుగులు వేస్తున్నారు. కాగా కేబినెట్సమావేశంపై వేయికళ్లతో ఎదురుచూసిన వాలంటీర్లకు నిరాశే ఎదురైంది. ఈ భేటీలో వాలంటీర్లపై ఎటువంటి చర్చ జరగక పోవడంతో వారు మరింత ఆందోళనకు గురయ్యారు. ఈ భేటీలో తమకు అనుకూలంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని భావించినా అటువంటి ప్రకటన రాకపోవడంపై ఆగ్రహానికి గురయ్యారు.
ఇప్పటికే వాలంటీర్లంతా కలిసి ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ అసోసియేషన్గా ఏర్పాటుచేసు కొని ఉద్యమ కార్యాచరణలు రూపొందించారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోవ డం తో ఈనెల 31 రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించే దిశగా అడుగులు వేస్తున్నారు.
వాలంటీర్స్ న్యాయపోరాటం
వాలంటీర్లకు న్యాయం చేయాలని కోరుతూ హైకోర్టు న్యాయవాది విశ్వేశ్వ రావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రెండు నెలలుగా జీతాలు అందక వారు ఇబ్బందులు పడుతున్నారని అందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలని కోర్టును కోరారు. 10 వేలరూపాయలు గౌరవ వేతనం ఇచ్చివాలంటీర్స్ కి ఉద్యోగ భద్రత కల్పించాలని విన్నవించారు. కాగా ఈనెల 31న విజయవాడలో జరిగే రాష్ట్ర సమావేశంలో ఆయన పాల్గొని భవిష్యత్ కార్యాచరణపై వాలంటీర్లకు మార్గనిర్దేశనం చేస్తారు.
న్యాయ పోరాటానికి వాలంటీర్లు
ఆగస్టు 31న రాష్ట్రస్థాయి భేటీ.. భవిష్యత్ కార్యాచరణపై ప్రణాళిక వాలంటీర్లకు న్యాయం చేయాలని కోరుతూ హైకోర్టు న్యాయవాది విశ్వేశ్వ రావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.#APVolunteers
Ap Volunteers Latest News Full Details
వాలంటీర్లకు సంబంధించి అప్డేట్ వచ్చిన పూర్తి వివరాలు ఈ క్రింద ఇవ్వబడిన లింక్ ను క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోగలరు..
గమనిక:: మరిన్ని పూర్తి వివరాలకు పైన ఉన్న లింక్ క్లిక్ చేసి తెలుసుకోండి.. ఫ్రెండ్స్ ..
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇