AP Volunteer Services List In Telugu

AP Volunteer Services List In Telugu

AP Volunteer Services List In Telugu

Volunteer Services List: వాలంటీర్ వ్యవస్థపై విమర్శలు చేస్తున్న వారికి, అలాగే ఈ వ్యవస్థను రద్దు చేయాలని కోరుకుంటున్న వారికి ఒక్క ప్రశ్న మాత్రమే ఉంది. అది అధికార పక్షం అయినా ప్రతిపక్షం అయినా సమాధానం చెప్పాలి.

WhatsApp Group Join Now

తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వరదల సమయంలో నడుము వరకు నీళ్లు ఉన్నా, నెత్తిపై బియ్యం మూట, చేతిలో కూరగాయల కవర్ పట్టుకొని ఇంటి ఇంటికి తిరిగిన వాలంటీర్స్ కంటే ఏమి సమాధానం చెబుతారు? వికలాంగులకు కూడా ఒక వాలంటీర్ తమిళనాడులోని హాస్పిటల్ కి వెళ్లి పెన్షన్ ఇచ్చి వచ్చాడు. అతనికి ఏమి సమాధానం చెబుతారు? చంటి బిడ్డను నడుముకు కట్టుకొని, ఎండనైనా పట్టించుకోకుండా పెన్షన్ ఇచ్చిన ఆ అమ్మాయికి ఏమి సమాధానం చెబుతారు? ఒక గర్భిణీ స్త్రీని వాలంటీర్స్ గంట సేపు ఎండలో నిలబెట్టి అవమానించారు. ఆ అమ్మాయికి ఏమి సమాధానం చెబుతారు? టీడీపీ ఇంట్లో వాళ్లకి కూడా ఇండ్ల స్థలాలు ఇప్పించి, పెన్షన్ ఇప్పించి, ఇలా ఎంతో మందికి సహాయం చేసిన వాలంటీర్స్ కి ఏమి సమాధానం చెబుతారు?.

టీడీపీ వారి ఇంట్లో వారికి కూడా ఇండ్ల స్థలాలు ఇప్పించి, పెన్షన్ ఇప్పించి, ఎంతో మందికి సహాయం చేసిన వాలంటీర్స్ గురించి ఏమి చెప్పాలి? వాలంటీర్స్ అనేక మంది ఆఫీసు బిల్డింగులపై ఎక్కి ప్రాణాలు కోల్పోయారు, ఇంకా మరెంత మంది ప్రాణాలు కాపాడారు? కరోనా విపత్తు సమయంలో, ప్రపంచ దేశాలు లాక్‌డౌన్‌లో ఉండిపోయినప్పుడు, మన ఆంధ్ర ప్రదేశ్ లో వాలంటీర్స్ కరోనా బాధితులకు మెడిసిన్, ఫుడ్, వ్యాక్సిన్, క్వారంటైన్ సదుపాయాలు, హాస్పిటల్ సేవలు అందించారు.

Latest Update Box

Latest Update

•జూలై ఒకటవ తేదీన ఇంటివద్దకే 7,000 పెన్షన్ New

•AP Volunteer Notification 2024 Key Dates and Important Information CLICK HERENew

Hot Topics 🔥: AP Volunteer Services List In Telugu

AP Volunteer Services List

AP Volunteer Services List:

గ్రామ/వార్డు వాలంటీర్లు 2019 ఆగస్ట్ 15 నాటి నుండి ఏప్రిల్ 2024 వరకు ఆయా సచివాలయ సెక్రటరీలకు సంబంధించి మేము (5 వేలు గౌరవ వేతనం పొందే వాలంటీర్) ప్రజలకు అందించిన సర్వీసులు.

Navasakam Survey

మాకు కేటాయించిన 60 లేదా 100 ఇండ్లకు ప్రభుత్వం పథకాలు పారదర్శకంగా అందించాలని మేము ఇంటింటికి వెళ్లి, ప్రతి వ్యక్తి యొక్క పూర్తి సమాచారాన్ని సేకరించాము.

PS-Admin

ఇంటి పన్ను, కుళాయి పన్నుకి సంబంధించిన డేటాను కలెక్ట్ చేసి అడ్మిన్ కి ఇవ్వడం, ఏటేటా కట్టవలసిన పన్నులను ఇంటింటికి వెళ్లి కలెక్ట్ చేసి అడ్మిన్ కి ఇవ్వడం. ఎవరికైనా అస్సెస్మెంట్ లేకపోతే దానికి సంబంధించిన డాకుమెంట్లు కలెక్ట్ చేయడం, ఇంటింటికి వెళ్లి కొలతలు కొలచి వ్రాయడం, గోడలు మీద అస్సెస్మెంట్లు వ్రాయడం.

DA-WWDS

Thalliki Vandanam Scheme 2025
Thalliki Vandanam Scheme 2025: తల్లికి వందనం పై ప్రభుత్వం కీలక నిర్ణయం

కొత్తగా కాస్ట్, ఇన్కమ్ సర్టిఫికెట్లు అప్లై చేయడం, 1B, ఆడంగల్స్, ఈ-శ్రమ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు, అమ్మఒడి, విద్యా-వసతి దీవెన సంబంధించి eKYCలు, CR-SDG సర్వే, వారానికి లేదా నెలకు టార్గెట్ గా సచివాలయంలో సర్వీసులు ఇచ్చాము. ఇల్లు లేనివారి డేటా కనుకొని జగనన్న ఇల్లు పధకం ద్వారా అప్లై చేశాం, ఎడ్యుకేషన్ సర్వే, సెప్టెంబర్ 2021 లో ప్రారంభమైన సిటిజెన్ ఔట్ రీచ్ (COP) సర్వేను సెక్రటరీలు రాకపోయిన వారి లాగిన్ లో ప్రతి నెల సర్వే పూర్తి చేయడం.

Welfare

మా క్లస్టర్ పరిధిలో అన్ని రకాల ప్రభుత్వ పథకాలకు అర్హులైన లబ్ధిదారులను కనుకొని సంబంధిత డాక్యుమెంట్లు సెక్రటరీకి ఇవ్వడం, ఫోటోలు, eKYCలు, అక్నాలెడ్జ్మెంట్లు, టెస్టిమోనల్స్, ఏ పథకానికి ఎవరు ఎంత లబ్ధి పొందారో సమాచారం ఇవ్వడం, నిరక్షరాస్యులను కనుకోవడం, పింఛన్ పంపిణీ.

Mahila Police

ఇంటింటికి వెళ్లి దిశ యాప్ ఇన్స్టాల్ చేయించడం, కోవిడ్ సమయంలో గ్రామ చివార్లలో డ్యూటీలు, ఇంటింటికి అగ్రిగోల్డ్ సర్వే, 9-19 సంవత్సరాలు ఆడపిల్లల డేటా సేకరణ, పండుగ సమయంలో డోర్ లాక్ సమాచారం, అక్రమ కార్యక్రమాల గురించి సమాచారం ఇవ్వడం.

ANM

కొన్ని రకాల వ్యాధులకు టాబ్లెట్లు ఇవ్వడం, బీపీ, షుగర్ సమాచారం సేకరణ, ఇంటి గోడల మీద తేదీ వ్రాయడం, ప్రతి వారం DRY DAY ప్రోగ్రాం, 0-19 సంవత్సరాల పిల్లల డేటా సేకరణ, కోవిడ్ సమయంలో వ్యాక్సినేషన్ మరియు కోవిడ్ వచ్చినవారికి టాబ్లెట్లు పంపిణీ, 50 సార్లు ఇంటింటికి వెళ్లి ఫీవర్ సర్వే, PMJAY రిజిస్ట్రేషన్, కుష్టు వ్యాధి సర్వే, మాస్కులు పంపిణీ, పైలెరియా టాబ్లెట్లు పంపిణీ, NCD-CD సర్వే.

VRO

రేషన్ కార్డులు సర్వే, యాడింగ్, న్యూ కార్డు, స్ప్లిట్టింగ్, ఇష్యూ కార్డ్, eKYC, ఫ్రీ రేషన్ కూపన్ల పంపిణీ, ఇంటింటికి రేషన్ పంపిణీ, ల్యాండ్ రీసర్వే, ప్రొవిషన్ సర్టిఫికెట్, ఓటర్ వెరిఫికేషన్, MLC ఓటర్, న్యూ ఓటర్ కార్డు అప్లై చేయడం, తుఫాను, వరదల సమయంలో భద్రత.

Planning – Surveyor

డ్రైనేజీ లేనివారికి గుంతలు కావాలా/వద్దా సేకరణ, అక్రమ నిర్మాణాల గురించి సమాచారం, క్లస్టర్ మాప్పింగ్, డోర్ నంబర్లు వ్రాయడం, కొత్త ఇల్లు కొలతలు కొలవడం, స్కూల్ మరమ్మతులు నోట్ చేయడం, ఖాళీ స్థలాలు గుర్తించడం.

Amenities – Engineering Assistance

Thalliki Vandanam Release Date 2025
Thalliki Vandanam Release Date 2025: తల్లికి వందనం రిలీజ్ డేట్ ప్రకటన

కొత్త కుళాయి, టాయిలెట్ అవసరమైన వారిని గుర్తించి కనెక్షన్ కోసం డాక్యుమెంట్ ఇవ్వడం, విద్యుత్ స్తంభాలు నంబర్లు వ్రాయడం, రోడ్లు సమాచారం, ఏ ఇంటిలో కుళాయి సరిగా రావడం లేదో గుర్తించడం.

Fisheries

చేపల చెరువుల గురించి సర్వే, HUB కావాలన్న వారికి సంబంధించిన డాక్యుమెంట్లు కలెక్ట్ చేయడం.

Energy Assistant

కరెంట్ మీటర్ సర్వే – ఆధార్ కి లింక్ చేయడం, తుపాన్లు, వరదల సమయంలో సర్వే.

Sanitization

తడి-పొడి చెత్తను వేరు చేయడానికి ఇంటింటికి డబ్బాలు పంపిణీ, ప్రతి నెల చెత్తకు సంబంధించిన వసూలు, మరణ-జనన ధ్రువీకరణ కోసం పత్రాలు వెరిఫికేషన్.

వాలంటీర్లు కేవలం పింఛన్, రేషన్ పంపిణీకి మరియు నవరత్నాలకు మాత్రమే పరిమితం కాదు. మేము 5,000/- లకే ఎన్నెన్నో సర్వేలు, పనులు చేశాం. గత 5 సంవత్సరాలలో కేవలం 5 వేలు అయినా పర్వాలేదు, ప్రభుత్వం తో కలసి పని చేసే అవకాశం వచ్చింది, ఎప్పటికైనా ప్రభుత్వం మాకు మంచి భవిష్యత్తు ఇస్తుందేమో, దానితో మా కుటుంబాలు బాగుపడుతాయని కలలు గన్న యువతకి ప్రతి ప్రభుత్వం షాక్ లు మీద షాక్ లు ఇస్తుంది. ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి..పోనీ న్యాయ పరంగా పోదమా అంటే అంతటి ఘనులతో పోరాడలేమని సత్యాన్ని చరిత్ర చెబుతుంది.

పైన ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మీ తోటి మిత్రులకు షేర్ చెయ్యగలరు.

Hot Topics 🔥: AP Volunteer Services List In Telugu

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now
Telegram Group Join Now

1 thought on “AP Volunteer Services List In Telugu”

Comments are closed.

error: Content is protected !!
    WhatsApp Join Group