
CCRC Cards in Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కౌలు రైతులందరికీ గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు ను. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలోని సొంత భూమిలేని వేరే యజమాని దగ్గర కౌలుకి భూమి చేసుకునే రైతులందరికీ కౌలు గుర్తింపు కార్డ్స్ ( CCRC Cards ) ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది.
ఖరీఫ్ మరియు రబీ సీజన్లకు సంబంధించి కౌలు రైతులకు ప్రభుత్వ పథకాలు అందాలంటే తప్పనిసరిగా రెవిన్యూ శాఖ జారీ చేసే కౌలు గుర్తింపు కార్డు (CCRC) ను తప్పనిసరిగా తీసుకోవాలి. ఈ CCRC కార్డు కలిగిన వారు మాత్రమే పంట నమోదు చేయడానికి అవకాశం కలుగుతుంది. పంట నమోదు ఆధారంగానే ప్రభుత్వం పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీ మరియు ఇతర వ్యవసాయ పథకాలను అమలు చేస్తుంది.ఈ పథకాలను రైతులకు అందించడం వలన వారి ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది మరియు వ్యవసాయ రంగంలో మరింత స్థిరత్వం కలుగుతుంది. CCRC కార్డు ద్వారా కౌలు రైతులు పంటల బీమా పథకంలో నమోదు చేసుకోవచ్చు. ఈ పథకం ద్వారా పంటలకు గాను బీమా సౌకర్యం అందించబడుతుంది, దీనివలన పంటల నష్టాలు వాటిని భరించే సామర్థ్యం కలిగిస్తుంది.
ఈ పేజీలో నేను మీకు కౌలు గుర్తింపు కార్డు ఎలా అప్లై చేయాలి, కావలసిన డాక్యుమెంట్స్ ఏంటి? రైతులే విధంగా ప్రయోజనం పొందుతారు పూర్తి వివరాలు అందిస్తాను. పేజిని చివరి వరకు ఫాలో అయ్యి మీకు ఏమైనా సందేహాలు ఉంటే మా వాట్సాప్ చానల్లో జాయిన్ అవ్వగలరు.
Table of Contents
CCRC Cards in Andhra Pradesh – కౌలు గుర్తింపు కార్డు
ఎవరైతే ST, SC, BC మరియు మైనారిటీ రైతులు స్వంత భూమి లేకుండా ఉండి వేరే వారి భూమిలో ఏవైనా పంటలు పండిస్తా ఉంటారో అటువంటి రైతులకు కౌలు గుర్తింపు కార్డు ( CCRC Cards ) ఇస్తారు.
ఈ సంవత్సరం ఖరీఫ్ మరియు రవి పంట కాలానికి సంబంధించి పొలం కౌలుకు చేసుకునే రైతులు తప్పనిసరిగా ఈ CCRC Cards పొందాలి. ఈ కార్డు ఉంటే భూమి యజమానికి సంబంధించి ఏవైతే సంక్షేమ పథకాలు పొందుతారో అవన్నీ కౌలు రైతు కూడా పొందవచ్చు ను. ఈ కార్డు మీ దగ్గర ఉన్నట్లయితే మీరు సాగు చేసే పంటకు సంబంధించి పంట నమోదు ( క్రాప్ బుకింగ్ ) లో నమోదు చేసుకోవచ్చను. ఇలా పంట నమోదులో నమోదు చేసుకుంటే అకాల వర్షాల వలన మరియు పంటకు ఏదైనా నష్టం వాటిల్లినప్పుడు ప్రభుత్వమే నేరుగా ఈ నష్టపరిహారం కౌలు రైతుదారునికి అందిస్తుంది.
ఇక ఇన్పుట్ సబ్సిడీ పథకం ద్వారా రైతులకు విత్తనాలు, ఎరువులు, కీటకనాశనాలు మొదలైనవి తక్కువ ధరకే అందించబడతాయి. దీనివలన రైతులు మంచి పంట పండించడానికి అవసరమైన అన్ని సాధనాలను తక్కువ ధరకే పొందగలుగుతారు. ఈ సబ్సిడీ పథకాలు కౌలు రైతులకు చాలా మేలు చేస్తాయి, ఎందుకంటే వారు భూమి యజమానుల పట్ల తమ ఆర్థిక ఆధారాన్ని తగ్గించుకోవచ్చు.CCRC కార్డు ఉన్న కౌలు రైతులు పంటల బీమా మరియు ఇన్పుట్ సబ్సిడీ పథకాలతో పాటు మరిన్ని ప్రభుత్వ పథకాల లబ్ధిని పొందగలుగుతారు. ఇది వారికి భూమి యజమానులతో సమానంగా అన్ని సౌకర్యాలు అందించేలా చేయవచ్చు. ఈ విధంగా, కౌలు రైతులు భూమి యజమానులకు అందించే అన్ని ప్రభుత్వ పథకాల లబ్ధి పొందవచ్చు.
- Thalliki Vandanam Scheme 2025: తల్లికి వందనం పై ప్రభుత్వం కీలక నిర్ణయం
- Thalliki Vandanam Release Date 2025: తల్లికి వందనం రిలీజ్ డేట్ ప్రకటన
- Thalliki Vandanam Scheme 2025: రిలీజ్ డేట్ ప్రకటించిన మంత్రి
- Today history: చరిత్రలో ఈరోజు జనవరి-20-2025
- Today News: 19 డిసెంబర్ 2024
CCRC Cards Required Documents – కౌలు గుర్తింపు కార్డు పొందుటకు కావలసిన డాక్యుమెంట్స్
కౌలు రైతుకి పంట సాగు చేసుకునే ప్రతి రైతుకు ఈ కింద చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ తప్పనిసరిగా కావలెను.
- భూమి యజమాని పాసుపుస్తకం Xerox
- భూమి యజమాని ఆధార్ కార్డ్ Xerox
- కౌలుదారు ఆధార్ కార్డ్ Xerox
- కౌలుదారు Bank Account Xerox
- కౌలు రైతు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు-3
CCRC Cards కి పైన చెప్పిన డాక్యుమెంట్స్ తో పాటు ఈ 10 రూపాయల రెవెన్యూ బాండ్ పేపర్ మీద 11 నెలలకు ఒప్పందం రాసుకొని మీ పంచాయతీ VRO గారికి Documents అన్ని ఇస్తే కౌలుకార్డు మంజూరు చేస్తారు.
CCRC Cards Apply Process – కౌలు గుర్తింపు కార్డు అప్లై చేయు విధానం
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామ వార్డు సచివాలయంలోని VRO సిర్ లేదా మేడమ్ కి ఈ కౌలు గుర్తింపు కార్డు జారీ చేసే పూర్తి బాధ్యతలు అప్పగించడం జరిగింది. పైన చెప్పిన అన్ని డాక్యుమెంట్స్ తీసుకొని మీకు సంబంధించిన విఆర్వో సార్ దగ్గరికి వెళ్ళండి. అన్ని డాక్యుమెంట్స్ తనిఖీ చేసి అలాగే భూమి కలిగిన యజమానితో మాట్లాడి కౌలు రైతుకి కౌలు కార్డు జారీ చేయడం జరుగుతుంది.
గమనిక : కౌలు కార్డ్ (CCRC) issue చేసేది VRO సర్ / మేడం మాత్రమే
మరియు మీకు CCRC కార్డ్ వచ్చిన తరువాత మీ గ్రామసచివాలయంలో ఉండే గ్రామ వ్యవసాయ సహాయకులకు Oka Copy అందించాలి.
CCRC Cards Benifits
కౌలు రైతులు సిసిఆర్సి కార్డ్స్ అప్లై చేసుకోవడం వలన సొంత భూమి కలిగిన యజమానులకు కలిగే అన్ని బెనిఫిట్స్ అన్ని కాలు రైతులుకు కూడా వర్తిస్తాయి.
- కౌలు రైతులకు ( బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు మాత్రమే ) అన్నదాత సుఖీభవ పథకం రావాలన్న ఈ CCRC Cards in Andhra Pradesh లో తప్పనిసరి.
- పండించిన పంటను కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోవడానికి ఈ కార్డు తప్పనిసరి.
- పంట నష్టం జరిగినప్పుడు నష్టపరిహారం పొందడానికి కూడా ఈ సిసిఆర్సి కార్డ్స్ ఉపయోగపడుతుంది.
- ఈ CCRC Cards కలిగిన రైతులు మాత్రమే పంటల బీమా పొందడానికైనా అర్హులు.
CCRC Cards Offical Login Page :: Click Here
వ్యవసాయక శాఖ యొక్క అఫీషియల్ వెబ్సైట్ :: Click Here
గమనిక :: పై విషయల మీద మీ ఏ డౌట్ ఉన్నా సరే మీ దగ్గరలోని విఆర్ఓ సార్ లేదా మేడం దగ్గరికి వెళ్లి సందేహాలు అన్ని క్లియర్ చేసుకోవచ్చును. అలాగే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే మీతోటి రైతులకు కూడా షేర్ చేస్తారని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
- Thalliki Vandanam Scheme 2025: తల్లికి వందనం పై ప్రభుత్వం కీలక నిర్ణయం
- Thalliki Vandanam Release Date 2025: తల్లికి వందనం రిలీజ్ డేట్ ప్రకటన
- Thalliki Vandanam Scheme 2025: రిలీజ్ డేట్ ప్రకటించిన మంత్రి
- Today history: చరిత్రలో ఈరోజు జనవరి-20-2025
- Today News: 19 డిసెంబర్ 2024
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇