
July 17th Schools Holiday 2024
July 17 Holiday: జూలై నెలలో స్కూళ్లు, కాలేజీలకు రెండు పండగ సెలవులు ఉన్నాయి. 2024 జూలై 17వ తేదీ (బుధవారం) రెండు తెలుగు రాష్ట్రాల్లోని స్కూళ్లు, కాలేజీలకు సెలవు ఇవ్వనున్నారు.
విద్యా శాఖ అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఇప్పటికే జూలై 17న సెలవు ప్రకటించింది. ఆ రోజున ప్రభుత్వ మరియు ప్రైవేట్ కార్యాలయాలకు కూడా సెలవు ఉంటుంది, ఎందుకంటే జూలై 17న మొహర్రం పండగ ఉంది. అందువల్ల తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్‌లోని స్కూళ్లు, కాలేజీలు ఆ రోజున మూసివేయబడతాయి.
మొహర్రం పండగ గురించి
కొన్ని ప్రాంతాల్లో ఈ పండగను పీర్ల పండుగ అని కూడా పిలుస్తారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ పవిత్ర పండగను పది రోజుల పాటు జరుపుకుంటారు. ఈ సమయంలో ఇస్లాం మతంలోని ప్రవచనాలు, మహ్మద్ ప్రవక్త బోధనలను వివరిస్తారు.
మొహర్రం మాసంలో పదో రోజున పీర్ల దేవుళ్లను ఊరేగిస్తారు. అంతకుముందు రాత్రి అగ్ని గుండంలో దూకడం, అగ్గిలో నడవటం వంటివి చేస్తారు. హజరత్ ఇమాం హుసేన్ ను స్మరించుకుంటూ పంజా, పీర్ల దేవుళ్ల ప్రతిమలను ఊరేగించి తమ సంతాపం ప్రకటిస్తారు.
కొన్ని ప్రాంతాల్లో కొందరు ముస్లింలు తమ రక్తంతో శోక తప్త హృదయాలతో తమ వీరులను స్మరించుకుంటారు. మహ్మద్ ప్రవక్త అధర్మాన్ని, అన్యాయాన్ని వ్యతిరేకించి ధర్మం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ప్రశాంతంగా జీవితం కొనసాగించాలని ఆకాంక్షించారు.
School Holidays 2024
Read more: July 17 Holiday: స్కూల్స్, కాలేజీలకు సెలవు
- 17-07-2024 (బుధవారం) మొహర్రం
- 27-07-2024 (శనివారం) బోనాలు
- 15-08-2024 (గురువారం) స్వాతంత్ర్య దినోత్సవం
- 26-08-2024 (సోమవారం) శ్రీ కృష్ణాష్టమి
- 07-09-2024 (శనివారం) వినాయక చవితి
- 16-09-2024 (సోమవారం) ఈద్ మిలాద్ ఉన్ నబి
- 02-10-2024 (బుధవారం) గాంధీ జయంతి
- 11-10-2024 (శుక్రవారం) దుర్గాష్టమి
- 31-10-2024 (గురువారం) దీపావళి
- 25-12-2024 (బుధవారం) క్రిస్మస్
- Thalliki Vandanam Scheme 2025: తల్లికి వందనం పై ప్రభుత్వం కీలక నిర్ణయం
- Thalliki Vandanam Release Date 2025: తల్లికి వందనం రిలీజ్ డేట్ ప్రకటన
- Thalliki Vandanam Scheme 2025: రిలీజ్ డేట్ ప్రకటించిన మంత్రి
- Today history: చరిత్రలో ఈరోజు జనవరి-20-2025
- Today News: 19 డిసెంబర్ 2024
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇