Table of Contents
KGBV Non-Teaching Posts | రాత పరీక్ష లేకుండా 10th అర్హతతో 729 ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్
KGBV Non-Teaching Posts :: సమగ్ర శిక్షా సొసైటీ ఆధ్వర్యంలోని కస్తూర్బాగాంధీ బాలిక విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 729 బోధనేతర పోస్టులను పొరుగు సేవల ద్వారా భర్తీ చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎస్పీడీ శ్రీనివాసరావు తెలిపారు. 2024-25 విద్యా సంవత్సర కాలానికి అర్హులైన మహిళ అభ్యర్థుల నుంచి ఈనెల 7వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని శుక్రవారం ఎస్పీడీ శ్రీనివాసరావు తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర శిక్షా సొసైటీ ఆధ్వర్యంలోని కస్తూర్బాగాంధీ బాలిక విద్యాలయాల్లో ఈ క్రింది విధంగా పోస్టులు ఉన్నాయి.
- టైప్-3 కేజీబీవీల్లో 547
- టైప్-4లో 182
టైప్-3 కేజీబీవీల్లో (Type-3 KGBV) ఖాళీల వివరాలు :
రాష్ట్రవ్యాప్తంగా టైప్-3 కేజీబీవీల్లో (Type-3 KGBV) 547 పోస్ట్స్ ఖాళీగా ఉన్నాయి. అవేంటో క్రింద టేబుల్ లో చూద్దాం..
S.NO | Post’s Names | Number of Posts |
1 | హెడ్ కుక్ ( Head Cook ) | 48 |
2 | సహాయ వంటమనిషి ( Assistant Cook ) | 263 |
3 | వాచ్ ఉమెన్ ( Watch Mean ) | 95 |
4 | పరిసర శుభ్రతా కార్మికులు ( Scavenger ) | 79 |
5 | స్వీపర్లు ( Sweeper ) | 62 |
టైప్-4 కేజీబీవీల్లో (Type-4 KGBV) ఖాళీల వివరాలు :
రాష్ట్రవ్యాప్తంగా టైప్-4 కేజీబీవీల్లో (Type-4 KGBV) 182 పోస్ట్స్ ఖాళీగా ఉన్నాయి. అవేంటో క్రింద టేబుల్ లో చూద్దాం..
S.NO | Post’s Names | Number of Posts |
1 | ప్రధాన వంటవారు ( Head Cook ) | 48 |
2 | సహాయ వంటమనిషి ( Assistant Cook ) | 76 |
3 | చౌకీదార్ ( Chowkidar ) | 58 |
KGBV ముఖ్యమైన తేదీలు
- దరఖాస్తు ప్రారంభం : అక్టోబర్, 7 – 2024
- దరఖాస్తు చివరి తేదీ : అక్టోబర్, 15 – 2024
- ఎంపిక సమావేశం : 2024, అక్టోబర్ 21
- ఫైనల్ లిస్ట్ APCAS చైర్మన్ కు పంపకం : 2024, అక్టోబర్ 22
ఇది చదవండి: పీఎం కిసాన్ పేమెంట్ స్టేటస్
కేజీబీవీ పోస్ట్స్ దరఖాస్తు ఫీజు
మీరు ఈ కేజీబీవి పోస్ట్స్ కి అప్లై చేసుకునేందుకు ఎటువంటి రుసుము లేదని తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఎలాంటి రుసుం చెల్లించకుండా దరఖాస్తు చేసుకోవచ్చును..
KGBV Post’s Salary s
అవుట్సోర్సింగ్ విధానంలో ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 10,000 నుండి 15,000 వరకు జీతం పొందవచ్చును.. ఉద్యోగం రకాన్ని బట్టి వారికి ఇచ్చే జీతం కూడా మారవచ్చును.
ఖాళీల వివరాలు మరియు ఏజ్ – అర్హత
- మొత్తం పోస్ట్స్ : 729
- ఏజ్ : 2024 అక్టోబర్ 1 తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండిన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చును. వయసు పరిమితి 45 సంవత్సరాలుగా నిర్ణయించారు.
- అర్హత : ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థులు కనీసం పదో తరగతి పాస్ అయి ఉండాలి. వాచ్మెన్, చౌకీదారు, స్వీపర్, వంటి ఉద్యోగాలకు శారీరక దృఢత్వం అవసరం.
కేజీబీవీ పోస్ట్స్ సెలక్షన్ ప్రాసెస్
సెలక్షన్ ప్రాసెస్ కమిటీ నిర్ధారించిన ప్రకారం, అభ్యర్థులను వారి దరఖాస్తులు ఉన్న ఆధారంగా ఎంపిక చేస్తారు. ప్రస్తుతం ఉన్న ఖాళీల వివరాలు ప్రకారం ఆ పోస్టులకి అనుగుణంగా అభ్యర్థులు వయస్సు, విద్యార్హతలను, బట్టి మరియు సంబంధిత అనుభవం ఆధారంగా ఎంపిక జరుగుతుంది. ఎటువంటి రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ గా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక జరుగుతుంది.
కావలసిన డాక్యుమెంట్స్ వివరాలు
- టెన్త్ క్లాస్ సర్టిఫికెట్ ( 10th Class Certificate )
- ఆధార్ కార్డు లేదా గుర్తింపు కార్డు
- అనుభవం ఉంటే సర్టిఫికెట్లు
- వయసు నిర్ధారించే సర్టిఫికెట్ ( Birth Certificate (or) Aadhar, Pan Card )
- దరఖాస్తు ఫారం ( మీరు అప్లై చేసే ఆఫీస్ నుండే అప్లికేషన్ పొందొచ్చు )
KGBV POST’S ఎలా అప్లయ్ చెయ్యాలి.?
పైన చెప్పిన పోస్టులన్నీ దరఖాస్తు చేసే విధానం పూర్తిగా ఆఫ్ లైన్ లో ఉంటుంది. అర్హత కలిగిన మహిళ అభ్యర్థులు తమ దరఖాస్తులను సంబంధిత మండల విద్యాశాఖ అధికారి ( MEO ) కార్యాలయానికి సమర్పించాలి. దరఖాస్తు ఫామ్ తో పాటు అవసరమైన డాక్యుమెంట్లను కూడా సమర్పించాలి.
KGBV District Wise Post’s List
ఏ జిల్లాల్లో ఎన్ని పోస్ట్స్ ఉన్నాయో ఈ క్రింద ఇవ్వబడిన లింకును క్లిక్ చేసి నోటిఫికేషన్ జిల్లాల వారీగా పోస్ట్స్ తెలుసుకొండి..
🔴 Application PDF :: Click Here
🔴 KGBV District Wise List : Click Here
🔴 KGBV Official Website :: Click Here
తరచూ అడిగే ప్రశ్నలు
1. నేను 18 సంవత్సరాల పూర్తి చేసుకోకపోతే దరఖాస్తు చేసుకోవచ్చా?
Ans: వయసు తప్పనిసరి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉండాలి.. 2024 అక్టోబర్ 1 నాటికి 18 సంవత్సరాలు నిండిన వారు మాత్రమే అర్హులు.
2. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి ఏవైనా పరీక్షలు ఉంటాయా ?
Ans: ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్షలు ఉండవు. ఎంపిక పూర్తిగా ఇంటర్వ్యూ ఆధారంగా జరుగుతుంది.
3. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ?
Ans: సెలక్షన్ ప్రక్రియ దరఖాస్తులు మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది.
4. సెలెక్ట్ అయిన వారికి జీతం ఎలా ఉంటుంది.?
Ans: ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 10,000 నుండి 15,000 వరకు జీతం పొందవచ్చును.. ఉద్యోగం రకాన్ని బట్టి వారికి ఇచ్చే జీతం కూడా మారవచ్చును.
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇