NTR Bharosa Pension – పెన్షన్ పంపిణీ కి సంబంధించి కొత్త రూల్స్ రిలీజ్

NTR Bharosa Pension- పెన్షన్ పంపిణీ కి సంబంధించి కొత్త రూల్స్ రిలీజ్?

NTR Bharosa Pension : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సంచలనాత్మక నిర్ణయాలతో ముందుకు వెళ్తుంది. గత నెల మనకి అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్స్ సంబంధించి పెన్షన్ అమౌంట్ అందరికీ పెంచి ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కి సంబంధించి పెన్షన్దారులకు కొత్తగా రూల్స్ రిలీజ్ చేయడం జరిగింది.

NTR Bharosa Pension Scheme

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ పంపిణీ అనేది వీలైనంత త్వరగా గత ప్రభుత్వంలో మాదిరి ఐదు రోజులు పంచడానికి అయితే వీల్లేదు.. కొత్తగా వచ్చిన ఆదేశాలలో పెన్షన్ పొందే ప్రతి లబ్ధిదారుడు తప్పకుండా క్రింద చెప్పినట్టుగా పెన్షన్ తీసుకునేటప్పుడు విధివిధానాలు తప్పనిసరిగా పాటించాలి. NTR Bharosa Pension కు సంబంధించి కొత్తగా రిలీజ్ అయిన విధివిధానాలు ఏంటో ఒకసారి చూద్దాం.

WhatsApp Group Join Now

1న ఆగస్టు 2024న పెన్షన్ల పంపిణీకి సంబంధించి CEO, SERP గారి సూచనలు

  • పింఛన్ల పంపిణీని పైన ఆగస్టు 2024న పింఛను పంపిణీ కోసం నియమించబడిన అందరు సిబ్బంది ఉదయం 6.00 గంటలకు పంపిణీ ప్రారంభిస్తారు.
  • మొదటి రోజే 99% పంపిణీ పూర్తి కావాలి. సాంకేతిక సమస్యలు తలెత్తితే రెండో రోజు పంపిణీ చేయాల్సి ఉంటుంది. పంపిణీ సమయము పొడిగింపు ఇవ్వబడదు.
  • మొదటి రెండు రోజుల పెన్షన్ పంపిణీపై అన్ని గ్రామాల్లో ప్రెస్ & సోషల్ మీడియా, బీట్ ఆఫ్ టామ్ టామ్, బహిరంగ ప్రదేశాల్లో ఆడియో రికార్డింగ్ ప్లే చేయడం మరియు వాట్సాప్ ద్వారా విస్తృత ప్రచారం చేయాలి. ఈ సమాచారం ప్రతి పించనుదారునికి చేరాలి.
  • 90 కంటే ఎక్కువ మంది పింఛనుదారులు ఒకే సిబ్బంది కి మ్యాప్ చేయబడిన చోట, అటువంటి మ్యాపింగ్ మొత్తం తగ్గించాలి (91 నుండి 100 పింఛనుదారులు: 86 మంది సిబ్బంది & 100 కంటే ఎక్కువ మంది పెన్షనర్లు: 12 మంది సిబ్బంది). ఈ రీ- మ్యాపింగ్ ప్రక్రియ 27.07.2024 నాటికి పూర్తి కావాలి.
  • సెక్రటేరియట్ వారీగా పెన్షన్ మొత్తాలు ఇప్పటికే అన్ని MPDOలు & కమీషనర్లకు పంపబడ్డాయి. ఈ మొత్తాలు 31.07.2024న సెక్రటేరియట్ బ్యాంక్ ఖాతాలకు జమ చేయబడతాయి. అన్ని PS/WASలకు వారి బ్యాంక్ మేనేజర్లకు నగదు ఆవశ్యక లేఖను ముందుగానే అందించమని తెలియజేయండి. 31.07.2024న మొత్తాన్ని విత్అ చేయండి.
  • 2వ తేదీన చెల్లింపు పూర్తయిన తర్వాత, చెల్లించని మొత్తాన్ని రెండు రోజుల్లోపు SERPకి తిరిగి చెల్లించాలి.
  • చెల్లించని పించన్లన్నింటికీ చెల్లించని కారణాలు సంక్షేమ సహాయకులు 5వ తేదీన లేదా అంతకు ముందు ఆన్లైన్ నందు తప్పనిసరిగా పొందుపరచాలి.
  • MPDOలు & కమీషనర్లు మీ సెక్రటేరియట్లలో ప్రతి గంట ప్రాతిపదికన పంపిణి పర్యవేక్షించాలి మరియు మొదటి రోజు పంపిణి పూర్తి చేసేలా చూసుకోవాలి.

మొదటి రోజే 99% పింఛన్లు పంపిణీ చేయాలి – CEO SERP వారి సూచనలు

అధికారులకు సెర్ప్ సీఈఓ ఆదేశం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కిందిస్థాయి ఉద్యోగులందరికీ సెర్ప్ సీఈవో పెన్షన్ పంపిణీకి సంబంధించి ఆదేశాలు జారీ చేయడం జరిగింది.

ఎన్టీఆర్ భరోసా పథకంకింద లబ్ధిదారులకు ఆగస్టు 1న అందించే సామాజికభద్రత పింఛన్లను మొదటి రోజే 99 శాతం పూర్తిచేయాలని సెర్ప్ సీఈఓ వీరపాండియన్ అధికారులను ఆదేశించారు. సాంకేతిక కారణాలు తలెత్తి పంపిణీకి వీలుగాని వాటిని రెండో రోజు అందించాలని సూచించారు.

ఉదయం 6 గంటలకే పంపిణీ ప్రారంభించాలని, దానికిసంబంధించి గ్రామాల్లో లబ్దిదారులకు తెలిసేలాప్రచారం చేపట్టాలని చెప్పారు. 31వ తేదీన బ్యాంకులనుంచి నగదు తీసుకునేలా సంబంధిత లేఖలనుబ్యాంకు అధికారులకు అందజేయాలని తెలిపారు.

AP Grama Volunteers
Ap Grama Volunteers: జిల్లాల వారీగా వాలంటీర్స్ డీటెయిల్స్ వెంటనే పంపండి

వాలంటీర్లకి నో ఛాన్స్

పెన్షన్ పంపిణీకి సంబంధించి గత ప్రభుత్వం లో వాలంటీర్లు కీలకపాత్ర పోషించడం జరిగింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ పంపిణీ అనేది గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా పంపిణీ అయితే చేయడం జరుగుతుంది. గత నెల ఉద్యోగుల చేతనే పెన్షన్ ఇప్పివ్వడం జరిగింది. అలాగే ఈనెల వాలంటీర్ల జోక్యం లేకుండానే సచివాలయం సిబ్బందితో పెన్షన్ పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీన్నిబట్టి వాలంటీర్లకు పెన్షన్ పంపిణీ బాధ్యత లేనట్టే.?

NTR Bharosa Pension Status Online

మీ పెన్షన్ పెండింగ్ లో ఉందా అప్రూవల్ ఉందా రిజెక్ట్ అయిందా ? తప్పకుండా ప్రతి ఒక్కరు చెక్ చేసుకోండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ కానుక వెబ్సైట్ పూర్తిగా మార్చడం జరిగింది. ప్రస్తుతం NTR Bharosa Pension గా సైట్ మార్చడం జరిగింది. ఇప్పుడు మనము ఆన్లైన్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్టేటస్ ( NTR Bharosa Pension Status Online ) ఎలా చెక్ చేయాలో ఈ క్రింది ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసుకొని పూర్తి వివరాల తెలుసుకోగలరు.

NTR Bharosa Pension Status :: Click Here

గమనిక :: పైన ఉన్న లింకును క్లిక్ చేసుకొని ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్టేటస్ ఆన్లైన్లో మీ మొబైల్ లోనే ఏ స్థితిలో ఉందో, పెండింగ్, అప్రూవ్, రిజెక్ట్ తెలుసుకోండి.

NTR Bharosa Pensions పంపిణీ రూల్స్ డౌన్లోడ్ చేసుకోండి ఇలా!

ఈ క్రింద ఇవ్వబడిన లింకును క్లిక్ చేసుకోనీ కొత్తగా వచ్చిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఆర్డర్స్ కాపీని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.. మరియు పూర్తి వివరాలు కూడా తెలుసుకోవచ్చును.

NPCI Link
NPCI Link రాష్ట్రంలో 18 సంవత్సరాలు నిండిన వారికి అలర్ట్: వీరందరికీ సంక్షేమ పథకాలు రావు!

Pension Orders Copy :: Click Here

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ గురించి మరింత సమాచారం తెలుసుకోవాలంటే ఈ క్రింది ఉన్న వీడియోని క్లిక్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోగలరు.

Pension పంపిణీ డెమో వీడియో :: Click Here

Also Read Post’s : NTR Bharosa Pension – పెన్షన్ పంపిణీ కి సంబంధించి కొత్త రూల్స్ రిలీజ్

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!
    WhatsApp Join Group