
RBI New Guidelines On Electricity Bills 2024
Electricity Bills: ఈ మధ్యకాలంలో అనేకమంది ఫోన్‌పే, పేటీఎం, గూగుల్ పే వంటి థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా కరెంట్ బిల్లులు చెల్లిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఇకపై ఆ యాప్స్ ద్వారా కరెంట్ బిల్లులు చెల్లించడం ఇక సాధ్యం కాదు. ఆ థర్డ్ పార్టీ యాప్స్ ఈ సేవలను నిలిపివేయడం వలన క్రెడిట్ కార్డుతో సహా బిల్లులు చెల్లించడం కూడా ఆగిపోతుంది. జూలై 1 నుంచి కొత్త ఆర్‌బీఐ నిబంధనలు అమలులోకి వచ్చిన నేపధ్యంలో, ఇకపై TGSPDCL, TGNPDCL, APSPDCL, APEPDCL, APCPDCL డిస్కమ్‌ల పరిధిలోని అన్ని కరెంట్ బిల్లులు ఆయా సంస్థల అధికారిక వెబ్‌సైట్లు లేదా మొబైల్ యాప్‌ల ద్వారా మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది.
Table of Contents
RBI New Guidelines On Electricity Bills
మరొకవైపు బిల్లు చెల్లింపుల్లో భద్రతను పెంచుతూ ఆర్బీఐ ఇటీవల ఒక ముఖ్య నిర్ణయం తీసుకుంది. భారత్ బిల్ పేమెంట్ సిస్టం ద్వారా మాత్రమే బిల్లు చెల్లింపులు జరగాలని నిర్ణయించింది. ఈ కొత్త నిబంధనలు జూలై 1 నుంచి అమలులోకి వచ్చాయి. హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ వంటి ప్రముఖ బ్యాంకులు ఇంకా భారత్ బిల్ పేమెంట్ సిస్టంను యాక్టివేట్ చేయలేదు. అందువల్ల, ఈ బ్యాంకులకు చెందిన కస్టమర్లు థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లిస్తే, అవి ప్రాసెస్ కావు. ఇప్పుడు విద్యుత్ బిల్లుల చెల్లింపుల విషయంలో కూడా ఇదే జరిగింది.
Read more: RBI New Guidelines On Electricity Bills 2024- Thalliki Vandanam Scheme 2025: తల్లికి వందనం పై ప్రభుత్వం కీలక నిర్ణయం
- Thalliki Vandanam Release Date 2025: తల్లికి వందనం రిలీజ్ డేట్ ప్రకటన
- Thalliki Vandanam Scheme 2025: రిలీజ్ డేట్ ప్రకటించిన మంత్రి
- Today history: చరిత్రలో ఈరోజు జనవరి-20-2025
- Today News: 19 డిసెంబర్ 2024
How To Pay Electricity Bills Online
ఇప్పటిI వరుకు వివిధ రకాల యప్స్ ద్వారా బిల్స్ కట్టేవారు మరి ఇప్పుడు RBI కొత్త నిబంధనలు ప్రకారం పవర్ బీల్స్ ఎలా కట్టాలి అనే సందేహం మిలో ఉంటుంది. అయితే మీకు సంబందించిన డిస్కామ్ వెబ్సైట్ లేదా యాప్ లో చెల్లించవచ్చు.ఏ జిల్లాల వారు ఏ వెబ్సైట్ లేదా యాప్ నందు చెల్లించాలి అనేది కింద తెలుసుకోవచ్చు.
గమనిక:- మీరు Offline లో బిల్ కట్టాలి అనుకుంటే మీ దగ్గర్లో ఉన్న సచివాలయం, మీ సేవ లేదా కరెంట్ ఆఫీస్ కి వెళ్లి మి యొక్క బిల్స్ చెల్లించండి.
District’s Under APSPDCL
- ఉమ్మడి చిత్తూరు జిల్లా
- ఉమ్మడి అనంతపురం జిల్లా
- ఉమ్మడి కర్నూలు జిల్లా
- ఉమ్మడి వైఎస్సార్ జిల్లా
- ఉమ్మడి నెల్లూరు జిల్లా
ఎవరు అయితే పైన కనిపించే జిల్లాకి సంబందించిన వారు ఉంటారో వారు కింద ఇవ్వబడిన వెబ్సైట్ లేదా యాప్ లో పవర్ బిల్ చెల్లించవచ్చు.
Official Website:- CLICK HERE
Official App :- CLICK HERE
District’s Under APCPDCL
- ఉమ్మడి కృష్ణా జిల్లా
- ఉమ్మడి గుంటూరు జిల్లా
- ఉమ్మడి ప్రకాశం జిల్లా
ఎవరు అయితే పైన కనిపించే జిల్లాకి సంబందించిన వారు ఉంటారో వారు కింద ఇవ్వబడిన వెబ్సైట్ లేదా యాప్ లో పవర్ బిల్ చెల్లించవచ్చు.
Official Website:- CLICK HERE
Official App:- CLICK HERE
District’s Under APEPDCL
- ఉమ్మడి ఉభయగోదావరి జిల్లా
- ఉమ్మడి విశాఖపట్నం జిల్లా
- ఉమ్మడి విజయనగరం జిల్లా
- ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా
Official Website:- CLICK HERE
Official App :- CLICK HERE
Read more: RBI New Guidelines On Electricity Bills 2024- Thalliki Vandanam Scheme 2025: తల్లికి వందనం పై ప్రభుత్వం కీలక నిర్ణయం
- Thalliki Vandanam Release Date 2025: తల్లికి వందనం రిలీజ్ డేట్ ప్రకటన
- Thalliki Vandanam Scheme 2025: రిలీజ్ డేట్ ప్రకటించిన మంత్రి
- Today history: చరిత్రలో ఈరోజు జనవరి-20-2025
- Today News: 19 డిసెంబర్ 2024
Electricity Bills Platform Fee Details
- ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లింపులు చేస్తే, రూ. 2.50 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
- డెబిట్ కార్డుల ద్వారా చెల్లింపులు చేస్తే, 0.90% అదనపు చార్జీ ఉంటుంది.
- క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లింపులు చేస్తే, 1.00% అదనపు చార్జీ ఉంటుంది.
- భారత్ QR కోడ్ ద్వారా చెల్లింపులు చేస్తే, 0.85% అదనపు చార్జీ ఉంటుంది.
- రూపే డెబిట్ కార్డులపై చెల్లింపులు చేసినప్పుడు, ఎటువంటి అదనపు చార్జీలు ఉండవు.
- UPI ద్వారా చెల్లింపులు చేసినప్పుడు, ఎటువంటి అదనపు చార్జీలు ఉండవు.
Electricity Bills Payment Process
Website
- డిస్కం లింక్ పై క్లిక్ చేయండి మీ చెల్లించాల్సిన కరెంట్ బిల్ నెంబర్ మరియు CAPTCHA ని ఎంటర్ చేసి Submit పై క్లిక్ చేయండి.
- బిల్ అమౌంట్ చూపించే పేజీరెండవ పేజీలో మీ బిల్ అమౌంట్ ఎంతో చూపిస్తుంది.
- చెల్లింపు విధానం ఎంచుకోవడంమూడవ పేజీలో మీరు ఏ విధంగా డబ్బులు కడుతున్నారో ఎంచుకోవాలి.ఉదాహరణకి, Phone Pay ద్వారా అమౌంట్ కట్టాలి అనుకుంటే:క్రింద UPI అనే ఆప్షన్ లో Phone Pay ని ఎంచుకోండి.మీ UPI అడ్రెస్ ని ఎంటర్ చేయండి (ఉదాహరణకి, 9700XXXXXX@ybl – Phone Pay ప్రొఫైల్ ఓపెన్ చేస్తే అక్కడ UPI అడ్రెస్ చూపిస్తుంది).
- Make Payment క్లిక్ చేయడంMake Payment పై క్లిక్ చేసిన వెంటనే Phone Pay లో చూపిస్తుంది.Phone Pay లో Confirm చేసినట్లయితే బిల్ పేమెంట్, ఎటువంటి అదనపు చార్జీలు లేకుండా పూర్తి చేయబడుతుంది.
App
- మీ సర్వీసు నెంబర్ మరియు మొబైల్ నెంబర్ తో రిజిస్టర్ అయి బిల్ చెల్లించవచ్చు. దీని వల్ల ప్రతి నెల బిల్ కట్టేటప్పుడు సర్వీసు నెంబర్ ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండదు.
- ఈ యాప్‌లో రిజిస్ట్రేషన్ అవసరం లేకుండా Quick Pay ఆప్షన్ ద్వారా కూడా డైరెక్ట్‌గా బిల్ చెల్లించవచ్చు.
- Quick Pay ఆప్షన్ ఎంచుకున్నాక, సర్వీసు నెంబర్ మరియు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి క్లిక్ చేయాలి.
- ఆ పేజీలో బిల్ అమౌంట్ చెక్ చేసుకుని PAY పై క్లిక్ చేసి, తరువాత Bill DESK పై క్లిక్ చేయాలి.
- ఆ పేజీలో బిల్ అమౌంట్ చెక్ చేసుకుని PAY పై క్లిక్ చేసి, తరువాత Bill DESK పై క్లిక్ చేయాలి.
- తదుపరి పేజీలో UPI మరియు OTHER PAYMENTS అనే రెండు ఆప్షన్స్ వస్తాయి. UPIలో Phone Pay, Google Pay, Pay TM వంటి ఆప్షన్స్ ఎంచుకుని బిల్ చెల్లించవచ్చు.
- Other Payments ఎంచుకుంటే, మిగతా ఇంటర్నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు ద్వారా కూడా బిల్ చెల్లించవచ్చు.
- Thalliki Vandanam Scheme 2025: తల్లికి వందనం పై ప్రభుత్వం కీలక నిర్ణయం
- Thalliki Vandanam Release Date 2025: తల్లికి వందనం రిలీజ్ డేట్ ప్రకటన
- Thalliki Vandanam Scheme 2025: రిలీజ్ డేట్ ప్రకటించిన మంత్రి
- Today history: చరిత్రలో ఈరోజు జనవరి-20-2025
- Today News: 19 డిసెంబర్ 2024
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇