Andhra Pradesh Check Ration Card Details Online – 2024

Andhra Pradesh Check Ration Card Details Online – 2024

Andhra Pradesh Check Ration Card Details :- ఈ రేషన్ కార్డు వ్యవస్థను ప్రవేశపెట్టడానికి ప్రధాన ఉద్దేశం, ఆహార ధాన్యాలు మరియు ఇతర వస్తువులను సబ్సిడీ ధరలతో అందించడం ద్వారా, దారిద్రరేఖ కింద ఉన్న వ్యక్తుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే. రేషన్ కార్డు అనేది ప్రభుత్వ విధించిన నియమ నిబంధనల ఆధారంగా జారీ చేయబడుతుంది. ప్రభుత్వ నిబంధనలను అనుసరించని వారికి రేషన్ కార్డు ఇవ్వబడదు. ఈ నిబంధనలు రాష్ట్ర ప్రభుత్వ విధానాల ఆధారంగా ఉంటాయి. ప్రభుత్వం మారినా, లేదా నిబంధనలు మార్చినా, అదే ప్రాతిపదికగా రేషన్ కార్డులను తొలగించడం లేదా కొత్త కార్డులు జారీ చేయడం జరుగుతుంది. మన రేషన్ కార్డు లో ఎంతమంది సభ్యులు ఉన్నారు, రేషన్ కార్డు యొక్క ఆన్లైన్ స్థితి ఏంటి అనే విషయాలను తెలుసుకోవడానికి క్రింది సూచనలను పాటించవచ్చు.

రేషన్ కార్డు లేదా రైస్ కార్డుకు సంబంధించి కార్డులో కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నారు.. కార్డు యాక్టివ్ లో ఉందా. ఇన్ యాక్టివ్ లో ఉందా... రైస్ కార్డు గురించి సమగ్ర సమాచారం తెలుసుకోండి..

మీ రేషన్ కార్డ్‌లోని సభ్యుల సంఖ్య, వారు యాక్టివ్‌లో ఉన్నారా లేదా ఇన్‌యాక్టివ్‌లో ఉన్నారా అనే సమాచారాన్ని తెలుసుకోవడానికి మీరు మీ మొబైల్ ద్వారా సులభంగా చెక్ చేసుకోవచ్చు. లేకపోతే, మీ సచివాలయానికి వెళ్లి కూడా ఈ వివరాలను తెలుసుకోవచ్చు. ఇప్పుడు, మీ మొబైల్‌లోనే ఈ సమాచారాన్ని ఏ విధంగా చెక్ చేయాలో చూద్దాం.

WhatsApp Group Join Now
Read more: Andhra Pradesh Check Ration Card Details Online – 2024

How To Check Your Ration Card Details Online

కింద లింక్ మీద క్లిక్ చెయ్యగా ఈ క్రింది విధంగా ఓపెన్ అవుతుంది.

Step: లింక్ ఓపెన్ అవ్వగానే హోమ్ పేజీలో రిపోర్ట్స్ అనే ఆప్షన్ ప క్లిక్ చేయగానే.. MIS అనే ఆప్షన్ ఓపెన్ అవడం జరుగుతుంది.. ఆ ఆప్షన్ నీ క్లిక్ చేయగానే క్రింది విధంగా ఓపెన్ అవుతుంది.

Step: అక్కడ మీకు రేషన్ కార్డు / రైస్ కార్డ్ సెర్చ్ అనే ఆప్షన్ కనిపించడం జరుగుతుంది.. ఆ ఆప్షన్ పై క్లిక్ చేయగానే క్రింది విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది.

Step: ఇక్కడ RC Number ఉన్న ప్రదేశంలో లబ్ధిదారుల రేషన్ కార్డు నంబర్ లేదా రైస్ కార్డు నంబర్ నమోదు చేసి ఎంటర్ కొడితే, క్రింద చూపిన విధంగా రేషన్ కార్డు వివరాలు తెరవబడతాయి.

Chandranna Bima
Chandranna Bima Status: 5 లక్షల స్టేటస్ వెంటనే తెలుసుకోండి!

Step: ఫైనల్ గా మీ కార్డు లని వివరాలు, సభ్యుల డీటెయిల్స్, మీ కార్డ్ ఆక్టివ్ లో ఉందో లేదో కూడా తెలుసుకోవచ్చు.. ఈ క్రింద ఇవ్వబడిన లింకును క్లిక్ చేసుకొని మీ రైస్ కార్డ్ డీటైల్స్ తెలుసుకొండి…

Key Points About AP Ration Card

ఇక్కడ రేషన్ కార్డు దారుల జిల్లా, వారి మండలం, సచివాలయం, రైస్ కార్డు నంబర్, పాత రేషన్ కార్డు నంబర్, అలాగే ఆ రేషన్ కార్డులో ఉన్న సభ్యుల సంఖ్య మరియు వారి స్థితి, అంటే వారు యాక్టివ్‌లో ఉన్నారా లేదా ఇన్‌యాక్టివ్‌లో ఉన్నారా అన్నది చూపబడుతుంది.రేషన్ కార్డు వివరాలను పై విధంగా చెక్ చేసిన తర్వాత, దానిలో ఎలాంటి పొరపాట్లు ఉన్నా, ఉదాహరణకు, కార్డుదారుల పేర్లలో పొరపాట్లు, వయసు తప్పుగా నమోదు చేయబడినట్లయితే లేదా వారి స్థితి ఇన్‌యాక్టివ్‌గా ఉన్నట్లయితే, ఈ పొరపాట్లను సవరించుకోవచ్చు. రేషన్ కార్డు కరెక్షన్ ప్రక్రియ సచివాలయం ద్వారా నిర్వహించబడుతుంది. ప్రస్తుతం ప్రభుత్వం మారిన కారణంగా, ఈ రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పులు చేసే ప్రక్రియ ఇంకా ప్రారంభించలేదు.

ప్రస్తుత పరిస్థితుల్లో, రేషన్ కార్డుకు ఆధార్ లింక్ అనేది అత్యవసరం, అందువల్ల ప్రతి ఒక్కరి రేషన్ కార్డుకు ఆధార్ లింక్ తప్పనిసరిగా ఉండాలి. రేషన్ కార్డుకు ఆధార్ లింక్ చేయబడలేదు అయితే, దానిని లింక్ చేయించుకోవాలి. ఈ లింక్ చేసే ప్రక్రియ కూడా సచివాలయం ద్వారా నిర్వహించబడుతుంది.

రేషన్ కార్డు యొక్క స్టేటస్ చూసినప్పుడు, రేషన్ కార్డు వివరాలు “No Data Found” అని లేదా ఇతర కారణాల వల్ల చూపించబడితే, ముందుగా రేషన్ కార్డు లేదా రైస్ కార్డు నంబర్ సరైనదిగా ఉన్నదో లేదో పరీక్షించుకోవాలి. నంబర్ సరిగా ఉన్నప్పటికీ వివరాలు కనిపించకపోతే, సచివాలయానికి వెళ్లి ఆ కార్డుకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవాల్సి ఉంటుంది.

AP రేషన్ కార్డుకు సంబంధించి ప్లేస్టోర్‌లో కూడా ఒక యాప్ అందుబాటులో ఉంది. ఈ యాప్ ద్వారా రేషన్ కార్డులో ఎంత మంది సభ్యులు ఉన్నారు, ఆ రేషన్ కార్డు స్టేటస్ ఏంటి వంటి వివిధ రకాల సేవలను సులభంగా పొందవచ్చు.

Conclusion

ఈ యాప్ ఉపయోగించి, AP రేషన్ కార్డుతో సంబంధించిన వివిధ సేవలను సులభంగా పొందవచ్చు. రేషన్ కార్డులో సభ్యుల సంఖ్య మరియు కార్డు స్థితి వంటి వివరాలను త్వరగా తెలుసుకోవడం సాధ్యమవుతుంది. అంతేకాకుండా, ఈ యాప్ సాయంతో మీరు రేషన్ కార్డుకు సంబంధించి అవసరమైన అన్ని సమాచారం అందించగలరు, తద్వారా మీ సేవల అనుభవం మరింత సులభతరం అవుతుంది.

Labour Insurance Telugu
Labour Insurance Telugu: తెల్ల రేషన్ కార్డు ఉన్నవారు సద్వినియోగం చేసుకోండి!

Official Website:- CLICK HERE

Official App:- CLICK HERE

పైనున్న పేజీలో ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే తప్పకుండా ప్రతి ఒక్కరు మీ ఫ్రెండ్స్ కి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను..

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now

Leave a Comment

error: Content is protected !!